తమిళనాడులో చోటుచేసుకన్న ఘోర ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారని.. మరో ముగ్గురు మాత్రం తీవ్ర గాయాలపాలై అసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం తెలిసిందే. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కొయంబత్తూర్, కూనూరు మధ్యలోని నీలగిరి కొండల్లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా ఆయన సతీమణితో పాటు మరో 12ఉన్నారన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ హెలికాప్టర్ కుప్పకూలడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే నీలగిరి కొండల్లో కుప్పకూలడంతో సందేహాలు వెల్లువెత్తున్నాయి. అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం.. హెలిక్యాప్టర్ ఒకదాని తర్వాత ఒకటి రెండు చెట్లను ఢీకొట్టింది. మంటల్లో కాలిపోతూ కూలిపోయింది. కాగా, హెలికాప్టర్ చెట్లను ఢీకొనడం ఏంటన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే మంటలు హెలిక్యాప్టర్ చెట్లను ఢీకొట్టిన తర్వాత చెలరేగాయా..? లేదంటే స్థానిక తేయాకు తోటలపై ఉన్న విద్యుత్ లైన్ కు తగలడం వల్ల మంటలు అంటుకున్నాయా..? అనే విషయంలో స్పష్టతలేదు.
బిపిన్ రావత్ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్. ఇది 4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్. దీనిలో 24 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాంటి విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది.? అయితే హెలిక్యాప్టర్ చెట్టును ఢీకొట్టి కూలిపోవడం చూశామని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్న క్రమంలో ఈ ఛాపర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ చెట్టును ఢీకొట్టిందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఎందుకని ఈ హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించింది..? లేదంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తూనే ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి కిందికి పడిపోతూ చెట్టుకు ఢీకొట్టిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వాతావరణ నివేదిక వచ్చిన తరువాతే అంతా క్లియర్ గా ఉందన్న సమయంలో బయలుదేరిన రావత్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తే అస్కారం వుందా.? ఒక వేళ అది కారణం కాకపోతే.. విద్యుత్ తీగలను తగలడం.. తక్కువ ఎత్తులో ఎగరడం కూడా కారణాలు కాకపోతే.. మరే కారణం చేత రావత్ హెలికాప్టర్ ఎందుకు కుప్పకూలిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీని వెనుక ఏదైనా కుట్ర వుందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. బిపిన్ రావత్‌ను టార్గెట్ చేసి మిస్సైల్ దాడికి పాల్పడి ఉండవచ్చా అనే సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
4వేల పేలోడ్ తీసుకెళ్లే సామార్థ్యం ఉన్న డబుల్ ఇంజన్ హెలికాప్టర్ లో యాంత్రిక వైఫల్యం ఏమైనా చోటుచేసుకుని ఉండొచ్చా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ అత్యాధునిక మిలిటరీ రవాణా హెలిక్యాప్టర్లో యాంత్రిక వైఫల్యం అనేది అసలే ఉండదని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ఇక సాంకేతిక వైఫల్యం కూడా తలెత్తినా అది ముందుగానే తెలుసుకునే వెసలుబాటు వుందా.? అన్న కోణంలోనూ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి, ఇక ప్రమాదానికి గల కారణాలను ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అధికారులే విశ్లేషించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more