Sudha Bhardwaj walks out of Byculla jail బైకులా జైలు నుంచి విడుదలైన న్యాయవాది సుధా భరద్వాజ్

Lawyer activist sudha bharadwaj released after 3 years in jail

Sudha Bharadwaj, Sudha Bharadwaj bail, Sudha Bharadwaj bail conditions, Sudha Bharadwaj nia court, Sudha Bharadwaj case, elgar parishad case, Sudha Bharadwaj elgar parishad, Byculla women’s jail, NIA court, mumbai news, mumbai latest news, nia, Crime

Lawyer and activist Sudha Bharadwaj, who has been in jail for over 3 years in relation to the Elgar-Parishad case, walked out of Byculla women’s jail. On Wednesday, a special National Investigation Agency (NIA) court allowed her release on provisional cash bail and a personal bond with directions to furnish sureties worth Rs 50,000 within three months.

షరత్తులతో కూడిన బెయిలుపై విడుదలైన సామాజిక‌వేత్త సుధా భ‌ర‌ద్వాజ్

Posted: 12/09/2021 06:28 PM IST
Lawyer activist sudha bharadwaj released after 3 years in jail

బీమా కోరేగావ్ కేసులో అరెస్టు అయిన సుధా భ‌ర‌ద్వాజ్ ఇవాళ రిలీజైంది. ముంబైలోని బైకులా మ‌హిళ‌ల‌ జైలు నుంచి ఆమె విముక్తి అయ్యారు. ఎన్ఐఏ కోర్టు విధించిన బెయిల్ ష‌ర‌తుల‌ను ఆమె పూర్తి చేశారు. ఈ కేసులో ఇప్ప‌టికే సుధా భ‌ర‌ద్వాజ్ మూడేళ్ల నుంచి జైలులో ఉంటున్నారు. అయితే ఈ కేసు విచార‌ణ మాత్రం కొన‌సాగ‌నున్న‌ది. బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఎన్ఐఏ కోర్టు సుప్రీంను ఆశ్ర‌యించింది. అయితే ఆ అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం ఇటీవ‌ల కొట్టివేసిన విష‌యం తెలిసిందే.

డిసెంబ‌ర్ 2017లో ఎలిగ‌ర్ ప‌రిష‌ద్ స‌ద‌స్సులో విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు ఇచ్చినట్లు సుధా భ‌ర‌ద్వాజ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో 2018, ఆగ‌స్టు 28వ తేదీన ఆమెను హౌజ్‌ అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 27వ తేదీన ఆమెను పూర్తిగా క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. బెయిల్‌పై రిలీజ్ అయిన సుధా.. కేసు గురించి మీడియాతో మాట్లాడార‌ద‌న్న నిబంధ‌న ఉన్న‌ది. 50 వేల పూచీక‌త్తుపై ఆమెను రిలీజ్ చేశారు. ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు విజిట్ చేయాల్సి ఉంటుంది. పుణె పోలీసులు ఈ కేసును విచారిస్తున్న స‌మ‌యంలో ఆమె య‌ర్ర‌వాడ జైలులో ఉంది. అయితే ఎన్ఐఏ విచార‌ణ స‌మ‌యంలో ఆమెను బైకులా జైలుకు త‌ర‌లించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles