ECIL to recruit 300 technical officers ఈసిఐఎల్ సంస్థలో 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Ecil recruitment 2021 apply for 300 technical officer posts

Electronics Corporation of India Limited (ECIL), ecil, recruitment, technical officers jobs, employment news, sarkari jobs, naukari, sarkari naukari, Engineering graduates, ECIL recruitment 2021

Electronics Corporation of India Limited (ECIL) has invited applications to recruit 300 technical officers on contract. The application form of this recruitment is available on the official website of ECIL and candidates can apply by December 21.

ఈసిఐఎల్ సంస్థలో 300 టెక్నికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Posted: 12/16/2021 12:31 PM IST
Ecil recruitment 2021 apply for 300 technical officer posts

నగరంలోని ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలో ఖాళీగా ఉన్న టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను అహ్వానిస్తోంది. నిర్ధేశిత విభాగంలో ఇంజనీరింగ్ పట్టా సాధించి.. ఏడాది కాలం పాటు ఏదేని సంస్థలో ఉద్యోగం చేసిన అనుభవం కలిగిన వారు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేస్తున్న సంస్థ ఎంపికై అభ్యర్థులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకోనుంది. ఏ ఏడాదికి ఆ ఏఢాది రినీవల్ అయ్యే అభ్యర్థుల పనికాలాన్ని వారి పనితీరు ఆధారంగా ఐదేండ్ల వరకు కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తారు. బీఈ, బీటెక్‌ చేసిన అభ్యర్తులు ఈ ఫోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
మొత్తంగా 300 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్న సంస్థ వీటిలో కులాలవారీగా రిజ్వరేషన్ ను కూడా అమలు చేస్తోంది. దీంతో మొత్తం 300 పోస్టులలో జనరల్‌ 136, ఈడబ్ల్యూఎస్‌ 15, ఓబీసీ 77, ఎస్సీ 50, ఎస్టీ 22 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ / ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెటేషన్‌ ఇంజినీరింగ్‌ / కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 60 మార్కులతో బీఈ లేదా బీటెక్‌ ఉత్తీర్ణులవాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత ఏడాది అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 21
వెబ్‌సైట్‌: http://careers.ecil.co.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles