Student Unions call for bandh over Inter results ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థులకు న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాలు

Telangana students unions protest as less than half pass ts inter result

ts inter, ts inter result, tsbie, Telangana Students, TS Inter Result, tsbie.cgg.gov.in, Students Federation of India, Progressive Democratic students Union, National students federation of India, NSUI, SFI, PDSU, Telangana Students Union, Intermiediate board, Telangana junior collages, inter result, ts inter marks memo download, education news

The Telangana State Board of Intermediate Education (TSBIE) released the TS Inter 1st year results on December 16 which saw 51 per cent of students from the 2020-21 batch failing the exams. Thereafter, several students unions including the Students Federation of India (SFI), Progressive Democratic Students Union, and National Students’ Union of India (NSUI) gathered in front of the TSBIE office in Nampally to protest against the results and demand fair evaluation of the results.

ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థులకు న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాలు

Posted: 12/20/2021 12:33 PM IST
Telangana students unions protest as less than half pass ts inter result

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు విద్యార్థి సంఘాలు పూనుకున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలలు మూతవేసి.. ఇంటర్ తొలి సంవత్సరం పరీక్షలలో తప్పిన విద్యార్థులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఇదివరకెన్నడూ లేని విధంగా కేవలం 49శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులను చేస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయంపై ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతికూలత వ్యక్తమవుతోంది. దీంతో వారి పక్షాన ఇవాళ కాలేజీలను బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.

కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎన్ఎస్ యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌వో నిరసనను తెలియజేస్తున్నాయి. విద్యార్థులు అందీఅందని ఇంటర్నెట్ సాయంతో.. కాలేజీల్లో లెక్చరర్లు చెప్పే పాఠ్యాంశాలు అర్థమయ్యి.. అర్థంకాక అనేక అవస్థలు పడుతూ పరీక్షలకు సిద్దమయ్యారని తెలిపారు. అనేక వ్యయప్రసాయలకోర్చి చదువుకుని, పరీక్షలను రాసిన విద్యార్థులను ఉత్తీర్ణులు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ఇంటర్ బోర్డు.. వారిని నిర్థాక్షిణ్యంగా తప్పేలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి.

ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేయించడంతోపాటు జవాబు పత్రాలను ఉచితంగా పునఃపరిశీలించాలని, ఫీజు లేకుండా ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. తెలంగాణలో ఇంటర్ తొలి సంవత్సరం పరీక్ష రాసిన మొత్తం నాలుగు లక్షల 59 వేల 242 మంది విద్యార్థులలో కేవలం రెండు లక్షల 24 వేల 12 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు కావడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles