నవ్విపోదురు గాక నాకేటి సిగ్గూ అన్నట్లు.. ఉద్యోగం రానంత కాలం ఉధ్యోగం వస్తే చాలునని అభిప్రాయం కాస్తా.. ఉద్యోగం వచ్చాక.. లంచాలు తీసుకునే ఉద్యోగం వస్తే బాగుండు అని.. మనిషి జీవితానికి తృప్లి ఉండదు. అయితే లంచాలు తీసుకోవడం తప్పు.. అన్న విషయం పాఠ్యాపుస్తకాల్లోనూ ఉంటుంది. ఇక అంతకుమించి.. ప్రతీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తాటికాయంత పెద్ద అక్షరాల్లోనూ రాయబడి వుంటుంది. అంతేకాదు.. ఈ కార్యాలయాల్లో ఎవరైనా అధికారి పనులు చేసేందుకు డబ్బులు అడిగితే.. అదే లంచం అడిగితే తక్షణం ఫలానా నెంబర్లకు ఫోన్ చేయాలని కూడా ఉంటోంది.
ఇక చిన్నారి విద్యార్థుల్లో అయితే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఎవరు వస్తారు.? అంటే ఠక్కున చెప్పే సమాధానం పోలీసులు. ఔను. కానీ అలాంటి పోలీసులు విద్యార్థుల మదిని చెడగోడుతున్నారు. చిరు ప్రాయంలోనే దేశ భావితరాల మదిలో లంచం తప్పు కాదు అని పాఠాలు బోధిస్తున్నారు. లంచాలు తీసుకునే అనేక ప్రభుత్వ కార్యాలయాలు పనులను సక్రమంగా చేయవని, అదే పోలీసులు అయితే ఒక్కసారి లంచం తీసుకున్నారా.. ఇక మీ పనులు ఠక్కున పూర్తి చేస్తారని వారి మదిని ఇప్పట్నించే కాలుష్యపరుస్తున్నారు. అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకుంటారా..? పోలీసులు కూడా లంచాలు తీసుకునే పనిచేస్తారా.? అని పిల్లలు భిక్కముఖాలు వేసుకున్నారు.
ఇది ఎక్కడో కాదు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో లంచాలు తీసుకోవడాన్ని సమర్ధించుకున్నారు అక్కడి పోలీసు అధికారి. అది కూడా ఒక పాఠశాల కార్యక్రమంలో విద్యార్థులందరి సమక్షంలో వేదికపైనుంచి ప్రసంగిస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని శాఖల్లోకెల్లా పోలీసు శాఖ ఉత్తమమైనదని చెప్పుకోచ్చిన ఆయన.. ఇంత చేసి.. తన పరువును తానే తీసుకున్నాడు. అతను మాట్లాడిన ప్రసంగాన్ని ఒక జర్నలిస్ట్ రికార్డ్ చేసి ఆ వీడియోని ట్విట్టర్ పెట్టాడు. ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. నెట్ జనులు మాత్రం ఈ విడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఉన్నావ్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ కీ పాఠశాల అనే కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆ జిల్లా పోలీస్ అధికారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. పోలీస్ శాఖ చాలా నీతివంతమైనదని.. ఇతర శాఖలు డబ్బు తీసుకున్నా పని చేయవు.. కానీ తాము మాత్రం డబ్బు తీసుకుంటే తప్పకుండా పని చేస్తామని చెప్పారు. కరోనా కష్టకాలం రాగానే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సెలవులు వచ్చాయి. ఉపాధ్యాయులైతే ఇంట్లో కూర్చోనే ఆరునెలల పాటు జీతాలు తీసుకున్నారు. కానీ తాము మాత్రం కరోనా వచ్చిదంటే.. సెలవులన్నీ రద్దు చేసుకుని విధులు నిర్వహించాలి. మరింతగా జనంలోకి వెళ్లి పనిచేయాల్సి వస్తుందని అన్నారు. ఇక దీనిపై నెట్ జనులు పోలీసులపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more