తన కళ్ల ముందే కలలసౌధం కూలిపోతుండటంతో ఆ మహిళ పోరాటానికి సిద్దమైంది. తన సంసారాన్ని చిధ్రం చేయడంతో పాటు తన భర్తకు కూడా దూరం చేసే కుట్రపై ఆమె పిడికిలి బిగింది. అంతేకాదు తనపై వేయకూడని ముద్ర వేయడంతో.. తన పరువు ప్రతిష్టాలకే భంగం వాటిల్లడంతో పాటు తన క్యారెక్టర్ ను చంపేసే కుతంత్రాన్ని అధిగమించాలని పోరాటం చేసింది. అనుకున్నదే తడవుగా అమెను విజయం వరించింది. ఎవరైతే అమె క్యారెక్టర్ ను మంచిది కాదు అని ముద్రవేశారో.. వారే వచ్చి అమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. అమె అత్తింటివారు మెట్టు దిగివచ్చారు. అమెను వద్దనుకుని వదిలేసిన భర్త.. అమెను వెతుకుంటూ వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఇలాంటి పరిణామాలెందుకు అంటే..
వివాహం జరిగిన ఆరు నెలలకే అమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను అత్తమామలు ఇంటి నుంచి తరిమేశారు. ఆమెకు విడాకులివ్వమని భర్తపై అత్తమామలు ఒత్తిడి చేశారు. అతను కూడా సరేనన్నాడు. ఏమి చేయలేని స్థితిలో ఆ యువతి కోర్టుకెక్కింది. అక్కడ ఆమె చెప్పిన ఒక నిజంతో కథ అడ్డం తిరిగింది. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నగరానికి చెందిన లలితకు.. స్థానికంగా నివసించే సునీల్ అనే యువకుడితో మే నెల చివరిలో వివాహం జరిగింది. అయితే వీరిద్దరు ఒకరినోకరు ప్రేమించిన కారణంగా వారి పెద్దలు అంగీకరించి పెళ్లి చేశారు.
కాగా పెళ్లైన తరువాత ఆరు మాసాలకే లలిత డిసెంబర్ మొదటి వారంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో లలిత అత్తమామలకు అనుమానం వచ్చింది. దీనికి తోడు ఇరుగు పోరుగు వారు వీరిని చూసి నవ్వుకోవడంతో భరించలేకపోయిన వారు పుట్టిన బిడ్డకు తండ్రి సునీల్ కాదని సందేహించారు. ఇక కాలనీలోని వారంతా లలిత గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసి సునీల్ తల్లిదండ్రులు లలితను ఆమె పుట్టింటికి పంపించేశారు. కొన్ని రోజుల తరువాత లలితకు విడాకుల నోటిస్ పంపించారు. దీంతో లలిత తన భర్తను నిలదీసింది. సునీల్ కూడా ఆ బిడ్డకు తండ్రి తాను కాదని చెప్పి వెళ్లిపోయాడు. భర్త కూడా ముఖం చాటేయడంతో లలిత ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించింది. అక్కడ లలిత, సునీల్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
అక్కడ లలిత బిడ్డ పుట్టుకకు సంబంధించిన ఒక నిజం చెప్పింది. పెళ్లికి ముందే తాను, సునీల్ ప్రేమించుకున్నామని.. అప్పుడు ఇద్దరూ శారీరకంగా కలిశామని.. ఆ కారణంగా గర్భం రావడంతోనే సునీల్ ఆమెను త్వరగా పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. కౌన్సెలింగ్ చేసిన కోర్టు వారు సునీల్, పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేస్తామని.. అందులో ఆ బిడ్డకు తండ్రి సునీల్ అని తేలితే అతనికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇది తెలిసిన సునీల్ విడాకులు కేసు ఉపసంహరించుకొని.. ఆ బిడ్డకు తండ్రిగా ఒప్పుకున్నాడు. నిజం తెలుసుకున్న లలిత అత్తమామలు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more