విదేశాల్లో కరోనా వాక్సీన్ రెండు డోసులతో పాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు అక్కడి ప్రజలు. ఇంతలా వీరు బుద్దిగా వాక్సీన్ తీసుకోవడానికి అక్కడి ప్రభుత్వాలతో పాటు ప్రవేటు సంస్థలు కూడా పూర్తి వాక్సీన్ తీసుకున్నవారికి పలు రకాల రాయితీలు కల్పించడం కూడా దోహదపడింది. తాజాగా అమెరికాలోని ఓ నగరంలో బూస్టర్ డోస్ వాక్సీన్ తీసుకున్నవారికి ఏకంగా వంద డాలర్లను అందిస్తోంది అక్కడి పురపాలక సంస్థ. ఇలాంటి రాయితీలన్నీ కేవలం విదేశీయులకేనా.. మన దేశంలోనివారికి ఏమీ లేవా.? అంటే ఉన్నాయనే చెప్పాలి.
మొన్నామధ్య మహారాష్ట్రలోని ఓ పురపాలక సంఘం కూడా ఇదే తరహాలో ఓ రాయితీని ప్రకటించింది. కాగా తాజాగా విమానయానం చేసే ప్రయాణికులకు స్వదేశీ ఎయిర్ లైన్స్ గో ఎయిర్ తాజాగా బంపరాఫర్ ప్రకటించింది. గో-ఫస్ట్ గా పేరు మార్చుకున్న గో-ఎయిర్ విమానయాన సంస్థ తమ ప్యాసింజర్లకు ఈ రాయితీని కల్పిస్తోంది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారో వారందరికీ 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. గో ఎయిర్ కు చెందిన విమానాల్లో ప్రయాణించాలని అనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిస్తే 20 శాతం తగ్గింపు పొందవచ్చు.ఈ ఆఫర్ ఇండియన్ ప్యాసింజర్లకు మాత్రమే వర్తిస్తుందని గో ఎయిర్ సంస్థ వెల్లడించింది.
గోవ్యాక్సి పథకంలో భాగంగా ఈ ఆఫర్ ను సంస్థ తీసుకొచ్చింది. గో ఫస్ట్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను ప్రయాణికులు తమతో పాటే తీసుకువెళాల్సి ఉంటుంది.ఎయిర్ పోర్టు చెకింగ్ కౌంటర్ వద్ద వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పకుండా చూపించాల్సి ఉంటుంది. లేదా ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌లో వ్యాక్సినేషన్ స్టేటస్ చూపిస్తే సరిపోతుంది.బుకింగ్ చేసుకున్నాక 15 రోజుల వరకు మాత్రమే డబుల్-వ్యాక్సినేషన్ డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రయాణికులు సెర్చ్ పేజీలోని ప్రోమో కోడ్ సెక్షన్ లో గోవాసీ (GOVACCI) అనే ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేసి డిస్కౌంట్ పొందొచ్చు.
భారతదేశంలో ఇప్పటికే 214కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 చొప్పున కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.ఇలాంటి పరిస్థితులలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు అన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా గో ఎయిర్ విమానయాన సంస్థ కూడా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.ఇదిలా ఉండగా యూఎస్ మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంది.ప్రస్తుతం అక్కడ నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 73% ఒమిక్రాన్ కేసులే ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.ఇప్పుడు యూఎస్‌లో ఒమిక్రాన్ అత్యంత సాధారణమైన కరోనా వైరస్ వేరియంట్‌గా మారిపోతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more