ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజే వేరు. దీనిలో ఉద్యోగ భద్రతతో పాటు, అనేక వెసులు బాటులు ఉంటాయి. అందుకే చాలామంది యువత పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. కొందరు కష్టపడి ఉద్యోగాన్ని సాధిస్తే.. మరికొందరు దళారులను లేదా హైటెక్ మాస్ కాపీయింగ్‌లకు పాల్పడుతుంటారు. దీనికోసం టెక్నాలజీని బీభత్సంగా వినియోగిస్తుంటారు. ఈ తెలివిదో సక్రమంగా రాసి ఉత్తీర్ణులయ్యేందుకు వినియోగిస్తే.. ఒక్కసారి కాకపోయినా మరోసారి అయినా జాబ్ కోట్టే అవకాశాలు మెండుగా వుంటాయి. అయితే ఎలాగైనా పోటీ పరీక్షలలో పాస్ కావాలని అక్రమ మార్గాలను అన్వేషిస్తే.. ఇదిగో ఇలా పట్టుబడాల్సిందే.
పోటీ పరీక్షలు అనగానే విద్యార్థులు ఎలాంటి కొత్త, వినూత్న పద్దతులను అనుసరిస్తారో.. వాటిని ఎలాగైనా పట్టుకోవాలని అటు పోలీసులతో పాటు ఎగ్జామినర్లు, ఇన్విజిలేటర్లు కూడా సిద్దమవుతుంటారు. ఈ కోవలోనే హైటెక్ కాపీయింగ్ కు సంబంధించిన ఘటనల తాలుకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోల్లో చేరడానికే అన్నట్లు ఓ ఔత్సాహికుడు తన హైటెక్ మాస్ కాపియింగ్ కు పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఔత్సాహిక యువతతో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అనేక మంది యువత హాజరయ్యారు.
కాగా, ఈ యువకుడు మాత్రం పోలీసు శాఖలో ఎంటర్ కావాలని అందుకు అక్రమమార్గన్ని నమ్ముకున్నాడు. దీన్ని ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. వివరాలు.. గత వారం యూపీలో సబ్ఇన్స్పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. దీంతో.. ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. మెటల్ డిటెక్టర్ మాత్రం మరో విధమైన శబ్దాన్ని వెలువరిచింది. దీంతో ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు.
చివరకు వారు.. అతగాడి శరీరమంతా పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. చివరకు వదిలేయబోయారు. ఇంతలో ఒక అధికారి వచ్చి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. అప్పుడు షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి. దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. ఇదేం తెలివిరా బాబు..’, ‘ఈ తెలివి చదువులో చూపిస్తే బాగుండు..’,‘ నీ తెలివి తెల్లారినట్లే ఉందంటూ’ కామెంట్లు చేస్తున్నారు.
#UttarPradesh mein Sub-Inspector
— Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021
की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more