కర్ణాటక అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పదమైన మత మార్పిడి బిల్లుకు అధికార పక్షం అమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యులు నిరసనలు నిరసనల మధ్యే బీజేపి ప్రభుత్వం మత స్వేచ్ఛా పరిరక్షణ బిల్లును ప్రవేశపెట్టి దానికి అమోదం తెలిపింది. సీఎం బస్వరాజ్ బొమ్మై నేతృత్వంలోని సభ గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
ఈ బిల్లును కాంగ్రెస్ తో పాటుగా క్రైస్తవ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపాయి. అయినా ప్రభుత్వం తాము తీసుకువచ్చిన బిల్లును అమోదించుకుంది. సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఆరెస్సెస్ ఎజెండాలో భాగంగానే ఈ బిల్లును తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. అయితే, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ఇది దేశ సంస్కృతిని కాపాడే బిల్లు అని చెప్పుకోచ్చారు.
ఈ బిల్లు ప్రకారం.. బలవంతంగా కానీ, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా కానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ మతమార్పిడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. చట్ట వ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more