బాలీవుడ్ నటి జూహీ చావ్లాపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అమె దాఖలు చేసిన పిటీషన్ ను కోట్టివేసిన ఆరు నెలలకు మళ్లీ కోర్టు తీర్పును సవాల్ చేయడంపై న్యాయస్థానం ఈ మేరకు అసహనం వ్యక్తం చేసింది. జూహీ చావ్లా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకగా గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా అమెతో పాటు మరికోందరు 5జీ టెక్నాలజీపై వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ జూహీ తాజాగా అప్పీల్ దాఖలు చేశారు. అయితే తీర్పుపై ఆరు నెలల ఆలస్యంగా అప్పీల్ చేయడంపై జస్టిస్ విపిన్ సంఘీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, జూహీ అప్పీల్ ను స్వీకరించిన న్యాయస్థాన డివిజన్ బెంచ్.. ప్రస్తుతం పలు పిటిషన్లు లిస్టింగ్ లో ఉన్నాయని.. అందువల్ల జనవరిలో 5జీ టెక్నాలజీపై దాఖలైన అప్పీలుపై విచారణ చేపడతామని వెల్లడించింది. 5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా జూహీతో పాటు మరికొందరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే అది కేవలం ప్రచారం కోసం వేసిన పిటిషన్ మాత్రమేనని పేర్కొంటూ న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. అంతేగాక, విచారణ సమయంలో జూహీచావ్లా అభిమానులు ఆన్ లైన్ లో జరుగుతున్న కోర్టు ప్రోసీడింగ్స్ లోకి చోరబడి ఆటంకం కలిగించారు.
ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జూహీతో పాటు మిగతా పిటిషనర్లకు రూ.20లక్షల జరిమానా విధిస్తూ ఈ ఏడాది జూన్లో దిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాజాగా జూహీ డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా 5జీ టెక్నాలజీపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. 5జీ టెక్నాలజీపై ప్రతి రోజూ ట్రయల్స్ జరుగుతున్నాయి. దీని వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు పెనుముప్పు పొంచివుందని అమె అన్నారు.
5జీ సేవలు అందుబాటులోకి తెస్తే మనుషులతో పాటు పశుపక్షాదులకు ముప్పు కలుగుతుంది. ప్రస్తుతమున్న రేడియేషన్ ప్రభావం 10 నుంచి 100 రెట్లు పెరుగుతుంది. 5జీ టెక్నాలజీ.. మనుషులకు, మూగజీవాలకు భద్రమైందా.. కాదా.. అన్నది అధికారులు స్పష్టంగా చెప్పేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి’’ అని జూహీ తాజా పిటిషన్లో పేర్కొన్నారు. ఇక రేడియో ధార్మిక తరంగాల వల్ల పశుపక్షాదులతో పాటు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయమై అథ్యాయనాలు కూడా లేవని అమె తన అప్పీలులో పేర్కోన్నారు. ఈ దిశగా పరిశోధనలు కూడా జరగాలని అమె న్యాయస్థానాన్ని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more