ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం విడుదల చేసిన రెండు జీవోలను న్యాయస్థానం కోట్టివేసింది. ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు కళాశాలల్లో ఫీజులను నిర్ధేశిస్తూ రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జీవోలను జారీ చేసింది. కాగా తాజాగా హైకోర్టు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఫీజులు నిర్ణయిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 53, 54జీవోలను ఆగస్టు 24న విడుదల చేసింది.
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజులను నిర్థేశిస్తూ జారీ చేసిన 53, 54 జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సోమవారం విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం.. కాలేజీలలో యాజమాన్యాలు ఏర్పాటు చేసిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరిగణలోకి తీసుకోకుండా, విద్యార్థుల వసతుల కల్పనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ మేరు యాజమాన్యాల నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
తూర్పుగోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్’ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు సహా పలు విద్యాసంస్థలు న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేశాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నిర్ణయించి ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి. ఫీజుల నిర్థారించే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని తెలిపాయి. ప్రభుత్వ ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని ప్రైవేటు విద్యాసంస్థలు వాదించాయి. వీరి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రైవేటు ఫీజుల జీవోలను తోసిపుచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more