Covid-19 Stays in Body for Months: Study కరోనా సోకిందా.. 230 రోజులు తిష్టవేసి.. ప్రత్యుత్పత్తి

Coronavirus can persist for months in heart brain study

Coronavirus, Long covid, long Covid sufferers, covid Vaccination, covid-19, SARS-CoV-2, persistence, U.S. National Institutes of Health, brain, Heart, liver, respiratory track, Health issues, india booster doses, why is a booster dose of vaccine required, what precautions should be taken after covid vaccination, precautions after taking covishield vaccine, booster dose in india for covid, booster dose covid vaccine, booster dose price in india, when to take booster dose of covid vaccine, is booster dose available in india

The coronavirus can spread within days from the airways to the heart, brain and almost every organ system in the body, where it may persist for months, a study found. Scientists at the U.S. National Institutes of Health said they found the pathogen is capable of replicating in human cells well beyond the respiratory tract.

కరోనా సోకిందా.. 230 రోజులు తిష్టవేసి.. ప్రత్యుత్పత్తి: అధ్యయనం

Posted: 12/28/2021 11:36 AM IST
Coronavirus can persist for months in heart brain study

చైనాలని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి బారిన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసింది. అందులో లక్షలాది మందిని కబళించ వేసింది. తొలి దశను మించి రెండో దశలో అనేకానేకులపై ఈ మహమ్మారి తీవ్రప్రభావం చూపింది. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన వాక్సీన్ ద్వారా ప్రజల శరీరంలో కరోనాను నిరోధించే యాంటీబాడీలను ప్రవేశపెట్టి.. దానిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇక దీంతో కరోనాను సమూలంగా లేకుండా చేసే చర్యలు చేపట్టారు. అయితే 2022 అందుకు టైమ్ లైన్ గా ఏర్పాటు చేసుకున్నారు. అయితే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వైద్యనిపుణుల అంచనాలను తలకిందులు చేసింది.

ఇక కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో ఆరు నుంచి ఎనమిది నెలల పాటు సహజంగా యాంటీబాడీలు నెలకొంటాయని గతంలో వైద్యులు చెప్పిన మాట. అయితే తాజా అధ్యయనాలు మాత్రం కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీల సంగతి అటుంచితే.. కరోనా వైరస్ కూడా మనిషి శరీరంలోని వివిధ బాగాల్లో తిష్టవేస్తుందని తేల్చింది. కరోనాకు రోగనిరోధకశక్తిని ఏమార్చి శరీరంలోకి ప్రవేశించడమే కాదు.. శరీరంలోని ఏకంగా దీర్ఘకాలంపాటు తిష్టవేస్తుందని అద్యయానాలు స్పష్టం చేస్తున్నాయి. మెదడు, గుండె సహా ఏ అవయవాన్నీ అది వదిలిపెట్టదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కరోనా నుంచి కోలుకున్నామని.. తమకు నెగిటివ్ వచ్చిందని కొంతకాలం మెడికేషన్ పాటించి.. ఆపై షరామామూలుగానే వ్యవహరిస్తామంటే కుదరదని.. కరోనా ప్రభావిత వ్యక్తుల్లో ఇది ఏకంగా ఏడు నెలలపాటు శరీరంలో ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకుల తాజా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అందుకనే అనేక మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత కూడా అనేక రకల అరోగ్య సమస్యలు ఎదుర్కోంటున్నట్లు తెలిపారు. కొందరిలో నిద్రలేమి, కొందరిలో జుట్టు రాలుట, కొందరిలో కీళ్ల నోప్పులు, ఇలా అనేకులు సమస్యలకు గురయ్యారని తెలిపారు.

ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి గరిష్టంగా 230 రోజుల పాటు ఉంటుందని.. ఈ క్రమంలో అది ప్రత్యుత్పత్తి సాగిస్తున్నట్లు తాము గమనించామని పరిశోధకులు గమనించారు. శరీరంలో అది దాదాపు అన్ని చోట్లకు పాకిపోయి.. ప్రత్యుత్పత్తి చేస్తున్నప్పటికీ ఊపిరితిత్తులు, ఇతర ప్రదేశాల్లో ఎలాంటి వాపులు కానీ, ఇబ్బందులు కానీ ఉండకపోవడం కొంత ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు. 44 మంది కరోనాతో మృతిచెందిన వారిని పరిశీలించి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. అయితే కరోనా సోకిన తర్వాత బాధితుల శ్వాసకోశ వ్యవస్థలోనే అత్యధికంగా 97.70 శాతం వైరస్ ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles