spearfisherman captures encounter with great white shark వైరల్ వీడియో: సోరచేపను నేరుగా వీడియోలో బంధించిన మత్య్సకారుడు

Virginia beach spearfisherman captures encounter with great white shark

outer banks, spearfisherman, spearfishing, white shark, spearfishing, David Scherrer, Virginia Beach Seafood Co, Virginia Beach, North Carolina, viral video, trending video

While spearfishing off the Outer Banks, David Scherrer encountered a great white shark and, initially, thought it was cool. But then the shark turned and swam right for him. Scherrer, working for Virginia Beach Seafood Co., was with other spearfishermen 20 miles off North Carolina. Scherrer was 50 feet down when the great white shark began swimming parallel to him at a distance.

వైరల్ వీడియో: సోరచేపను నేరుగా వీడియోలో బంధించిన మత్య్సకారుడు

Posted: 12/29/2021 07:35 PM IST
Virginia beach spearfisherman captures encounter with great white shark

షార్క్‌ చేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. అవి ఆకలితో వేటాడుతున్న క్రమంలో ఎంత ప్రమాదకరంగా వుంటాయో.. ఎలా ఆహారాన్ని సంపాదిస్తాయో కూడా చాలామందికి తెలిసిందే. అయితే ఈ షార్క్‌ చేపలను వీడియో తీసేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిజానికి వాటికి తెలియకుండానే వీడియో తీస్తారు గానీ నేరుగా తీసే ధైర్యం మాత్రం చాలమటుకు చేయరు. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా షార్క్‌ చేపకు ఎదురుగా వెళ్లి దానిని కొన్ని నిమిషాల పాటు వీడియో తీసి కెమెరాలో బంధించాడు.

అసలు విషయంలోకెళ్లితే.. డేవిడ్ షెర్రర్ అనే చేపల పట్టే వ్యక్తి నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున డైవింగ్‌ చేస్తూ ఒక అద్భుతమైన తెల్లషార్క్‌ చేప ఫుటేజ్‌ని తీశాడు. అయితే అతను ఆ షార్క్‌  చేపను చాలా దగ్గర నుంచి (ఫేస్ టు ఫేస్) వీడియో తీశాడు. ఒకనొక దశలో ఆ చేప అతనికి దగ్గరగా సమీపించడమే కాక చేతిలో ఉన్న గన్‌ని చూసి తనను తాను రక్షించుకునే నిమిత్తం వెనుదిరుగుతుంది కూడా. ఎంతోమంది ఈ షార్క్‌ చేపలను వీడియో తీశారు గానీ ఇలా షార్క్‌ చేపకు అతి చేరువలో నేరుగా వీడియో చిత్రీకరించలేదు. అతని అదృష్టమో ఏమో గానీ అతనిపై మాత్రం దాడిచేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా వీక్షించండి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles