ప్రకృతిని అస్వాదిద్దామని వెళ్లిన పర్యాటకుల పాలిట ఆ కొండ మృతువుగా మారింది. వాటర్ పాల్స్ పక్కనే వున్న కొలనులో పడవలతో వెళ్తున్న వారిపై పగబట్టినట్టు పెద్ద కొండ చరియ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యటకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. అనేక మందికి గాయాలు కాగా.. ముగ్గురు గల్లంతయ్యారు. పర్యాటకులపై ప్రకృతి పగబట్టిన ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. కొలనులో విహరిస్తున్న తమవారిని మరో పడవలో ప్రయాణిస్తున్న ఓ పర్యాటకుడు వీడియో తీస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ వెంటనే పర్యాటకుల హారాకారాలు వినిపించాయి. పెద్ద కొండచరియ విరిగిపటడంతో ఒక్కసారిగా కొలనులోని నీళ్లు కూడా ఉవ్వెత్తున్న ఎగసి పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పర్యాటకులు నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌లోని ఓ చెరువులో టూరిస్టులతో కొన్ని చిన్న మోటర్ బోట్స్ వాటర్‌ఫాల్ సమీపం నుంచి వెళ్తున్నాయి. ఇంతలో పక్కనే ఉన్న పెద్ద కొండ నుంచి కొంత భాగం పగిలిపోయి.. కిందనే ఉన్న రెండు బోట్ల మీద పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు టూరిస్టులు మృతి చెందారు.
మరో 30 మంది టూరిస్టులు గాయపడ్డారు. మరో 20 మంది టూరిస్టులు చెరువులో గల్లంతయ్యారు. వాటర్ ఫాల్, పక్కనే చెరువు.. ఉండటంతో దాన్ని టూరిస్ట్ స్పాట్గామార్చారు. ఇది బ్రెజిల్‌లోని సావో పాలోలో ఉంది. ఈ చెరువు దాదాపు 418 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ ఘటనను మరో పడవలో వెళ్తున్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఎవ్వరూ ఊహించని ప్రమాదం ఇది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Horrific:
— RUFFLED_ZEN (@RUFFLED_ZEN) January 9, 2022
At least 6 killed in canyon wall collapse in southeastern Brazil
World
Sunday, 9 January 2022 | MYT 12:03 PM pic.twitter.com/Jc7n654jOb
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more