ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అనేక దేశాలు సాధారణంగా తీసుకుంటున్నాయని, అయితే ఇది తేలిగ్గా తీసుకోవాల్సిన వేరియంట్ కాదని, ప్రాణాంతక వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయన్న ఆపోహలను వీడాలన్నారు. కరోనా టీకా తీసుకోని వారికి దానితో ముప్పు ఎక్కువని ఆయన హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్రభావం తగ్గిపోతోందని, డెల్టాను ఒమిక్రాన్ అధిగమించేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కవారంలోనే కోటిన్నర కేసులు నమోదయ్యాయన్నారు.
రికార్డు స్థాయిలో యూరోప్ దేశాల్లో కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా.. టెడ్రోస్ మరోసారి వార్నింగ్ జారీ చేశారు. మంగళవారం ఒక్క రోజే ఫ్రాన్స్‌లో సుమారు 5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇక బుధవారం తొలిసారి జర్మనీలో ఏకంగా లక్ష పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్తగా సుమారు రెండు కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డెడ్రోస్ తెలిపారు. ఒమిక్రాన్‌తో స్వల్ప లక్షణాలే కలుగుతాయన్న తప్పుడు వార్తలతో.. ఆ వేరియంట్ వ్యాప్తి మరింత వేగం పుంజుకున్నట్లు ఆయన చెప్పారు. ఎవరూ తప్పు చేయవద్దు అని, ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు.
ఒమిక్రాన్ దూసుకెళ్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని, దాని వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే వైరస్‌ను కట్టడి చేయాలని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సినేషన్ వేగంగా లేని దేశాలు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. అతివేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ డైరక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ తెలిపారు. కేసులు పెరిగితే ఇప్పుడున్న ఆరోగ్య సిబ్బందిపై పనిభారం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. దాని వల్ల ప్రతి నలుగురిలో ఓ వైద్యసిబ్బంది మానసిక ఆందోళనలకు లోనవుతున్నట్టు ఇటీవలి ఓ స్టడీ పేర్కొందని గుర్తు చేశారు. కేసులు పెరిగితే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదమూ ఉంటుందని, అది ఒమిక్రాన్ కన్నా ఇంకా ప్రమాదకరంగా పరిణమించే ముప్పుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more