ఎస్బీఐ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, కారు లోన్ వంటి 3 రకాల లోన్స్ అంధించనున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్‌పై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా వడ్డీ ఇస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ గోల్డ్ లోన్ మీద వడ్డీ రేటు 7.3 శాతం నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా రుణ మొత్తాన్ని చెల్లించడానికి పలు ఆప్షన్లు అందుబాటులో ఉంచింది. బుల్లెట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఈఎంఐ వంటి ఆప్షన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న బంగారం నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. 50 లక్షల వరకు లోన్ ఇవ్వనుంది.
అలాగే, ఎస్బీఐ కారు లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. దీని మీద వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం కానుంది. కారు ధరలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు కూడా ఉండవు. అలాగే టూవీలర్ లోన్ పొందాలని భావించే వారికి కూడా ఈజీ రైడ్ ప్రిఅప్రూవ్డ్ రుణాలు లభిస్తున్నాయి. రూ.10 వేలకు ఈఎంఐ రూ.251 నుంచి ప్రారంభం అవుతోంది.
ఇక మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవాలంటే వాటికి కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుంది. ఈ రుణాలపై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కేవలం 4 క్లిక్స్‌తోనే లోన్ పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. ఈ తరహా రుణాలపై కూడా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇకపోతే ఈ రుణాలు అన్నీ కూడా యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more