ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని పేర్కొన్న న్యాయస్థానం.. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. కాగా ఇటీవల నీట్ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు వెలువరించింది.
కాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయరాదని, ఈ కారణంగా నీట్ పీజీ కౌన్సిలింగ్ జాప్యమవుతుండటాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు.
‘‘సామాజిక ఆర్థిక అసమానతలకు అనుగుణంగా ప్రతిభను పరిగణనలోకి తీసుకోవాలి. రిజర్వేషన్లతో వెనుకబాటుతనాన్ని రూపుమాపొచ్చన్న విషయాన్ని మరచిపోకూడదు. రిజర్వేషన్లతో ప్రతిభను ముడిపెట్టరాదు. దాని వల్ల సామాజిక న్యాయం విషయంలో మరిన్ని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నల ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుత కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడి భవిష్యత్తు రిజర్వేషన్ల అర్హతలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ కేసు తుది విచారణ మార్చి చివరి వారంలో చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more