సెంట్రల్ విస్టా పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవన సముదాయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్ లో ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ. 977 కోట్లుగా ఉంది. అయితే ఏడాది గడిచే లోగానే బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా 29 శాతం పెరుగుదలతో రూ. 282 కోట్ల మేర పెరిగి... ప్రస్తుతం రూ. 1,249 కోట్లకు చేరుకుంది. కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ చేపట్టింది. రాష్ట్రపతి భవన్ కు కూతవేటు దూరంలో 13 ఎకరాల స్థలంలో పార్లమెంటు భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి.
ఈ ఏడాది మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం డెడ్ లైన్ ను అక్టోబర్ కు పొడిగించారు. కరోనా నిబంధనలు కూడా అడ్డురాని విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టు అయినందువల్ల పనులకు ఆటంకం కలగకుండా చూడాల్సి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పార్లమెంటు నిర్మాణ పనులకు కోవిడ్ ఆంక్షలు వర్తించవని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న పార్లమెంటు భవనం బ్రిటీష్ వారి కాలంలో నిర్మించినది. అయితే అందులో పార్లమెంటు సభ్యులకు చాంబర్లు లేకపోవడం గమనార్హం.
ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత భవనం లేకపోవడం, ఎంపీలకు సరైన విధంగా కార్యాలయాలు లేకపోవడం తదితర కారణాలతో కొత్త భవనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్త పార్లమెంటును లోక్ సభ ఛాంబర్ లో 888 మంది ఎంపీలు కూర్చునేలా నిర్మిస్తున్నారు. అంతేకాదు జాయింట్ సెషన్ (లోక్ సభ, రాజ్యసభ)లో 1,224 మంది సభ్యులు కూర్చునేలా అత్యంత విశాలంగా నిర్మిస్తున్నారు. రాజ్యసభలో 384 మంది కూర్చునేలా... అవసరమైతే సీటింగ్ పెంచుకునేలా నిర్మాణం చేపట్టారు. ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల కార్యాలయం ఉండేలా పార్లమెంటు ప్రాంగణంలోనే శ్రమ శక్తి భవన్ ను నిర్మిస్తున్నారు. ఈ భవన్ 2024కి పూర్తవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more