Student unions call for ‘Bihar Bandh’ tomorrow ‘‘బిహార్ బంద్’’కు విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

Protest over rrb results student unions call for bihar bandh on friday

Students Unions, students protest violent, Indian Railways, RRB NTPC results, Bihar violence, BIhar Bandh, bihar, bihar protest, Railway Recruitment Board, RRB results, NTPC exam Bihar, Bihar Bandh date, Jobs in Railways, Railway Jobs

The job aspirants blocked the New Delhi-Kolkata main railway tracks and some others protested in Bihar's Arrah and Sharif Railway station. The protesters also allegedly set a train on fire in Arrah. Students union body AISA in Bihar have called a statewide ‘bandh’ tomorrow in wake of the recently declared NTPC stage 1 exam results . Violence have broken out in many parts of the state after the announcement of the results.

ఆర్ఆర్‌బీ అభ్యర్థుల ‘‘బిహార్ బంద్’’.. ఆందోళన హింసాత్మకం.. రైలు దహనం

Posted: 01/27/2022 12:31 PM IST
Protest over rrb results student unions call for bihar bandh on friday

బీహార్‌లో ఆర్ఆర్‌బీ ఎన్టీపిసి నోటిఫికేషన్లో అవకతవకలకు విద్యార్థి సంఘాలతో పాటు యువజన సంఘాలు తెలుపుతున్న నిరసనలు ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయియి. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజున బిహార్ బంద్ కు విద్యార్థి, యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎన్టీపిసీ స్టేట్ 1 పరీక్ష ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా ఆశావహులు, నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. విద్యార్థుల అందోళనలు పరిశీలించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేయడాన్ని “బూటకం” అని విద్యార్థుల సంఘాలు పేర్కొన్నాయి. కాగా, నిరుద్యోగ యవత, ఆశావహుల ఆందోళనలు హింసకు దారితీసిన విషయం తెలిసింది. నిన్న నిరసనకారుల అందోళనలలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అనేక రైళ్లపై రాళ్లదాడికి దిగారు. ఓ రైలును దహనం చేశారు.

ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పరీక్ష-2021కి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) 2019లో నోటిఫికేషన్ విడుదల చేసింది. లెవల్-2 నుంచి లెవల్-6 వరకు మొత్తం 35 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పరీక్ష ఫలితాలు ఈ నెల 15న విడుదలయ్యాయి. అయితే, అభ్యర్థుల ఎంపికకు మరో పరీక్ష నిర్వహిస్తామని రైల్వే శాఖ ప్రకటించడం అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది. నోటిఫికేషన్‌లో ఒకటే పరీక్ష అని చెప్పి ఇప్పుడు రెండు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీహార్‌లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గయలో భభువా-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. మరికొన్ని రైళ్లపై రాళ్లదాడికి దిగారు.  

జెహనాబాద్‌లో మోదీ దిష్టిబొమ్మను రైలు పట్టాలపై దహనం చేశారు. సీతామర్హిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోనూ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే, సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అభ్యర్థులు మూడు వారాల్లోగా తమ సలహాలు, సందేహాలను ఈ కమిటీకి తెలియజేయాలని కోరింది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిని జీవితాంతం రైల్వే ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించింది. కాగా, అభ్యర్థుల ఎంపికకు తాము రెండు పరీక్షలు నిర్వహిస్తామనే చెప్పామని రైల్వే శాఖ చెబుతోంది. ఫిబ్రవరి 23 నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles