Omicron natural vaccine other COVID variants: ICMR study ఐసీఎంఆర్ ఆద్యయనంలో ఆశ్చర్యకర విషయాలు.. ‘‘ఒమిక్రాన్ సోకడం మంచిదే’’

Omicron neutralises delta gives immunity against other variants too says icmr study

Coronavirus, COVID-19, Omicron, Omicron antiviral, corona vaccine antibodies, Indian Council of Medical Research, National Institute of Virology, Antibodies, ICMR study, immune response, other variants of concern, Delta variant

Antibodies generated by Omicron, are effective against other variants of concern, a latest ICMR-backed study has said. The study conducted by Indian Council of Medical Research and National Institute of Virology of Pune said, “Individuals infected with Omicron have a significant immune response which could neutralise not only Omicron but also other variants of concern, including the most prevalent Delta variant,” said the study, which is a pre-print and not peer-reviewed.

ఐసీఎంఆర్ ఆద్యయనంలో ఆశ్చర్యకర విషయాలు.. ‘‘ఒమిక్రాన్ సోకడం మంచిదే’’

Posted: 01/27/2022 03:39 PM IST
Omicron neutralises delta gives immunity against other variants too says icmr study

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైపోయింది. డబ్ల్యూహెచ్ వో కూడా ఇప్పటికే ఇదే విషయాన్ని చెప్పింది. చాలా మంది దాని బారిన పడ్డారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నట్లు ఒమిక్రాన్ వేరియంట్ మహమ్మారి కూడా ప్రమాదకారి అన్న అంచనాలు మాత్రం రివర్స్ అంటూ సరికొత్త అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఒమిక్రాన్ మహమ్మారి ప్రపంచ మానవళికి సోకడం వల్ల చెడు కన్నా మంచే ఎక్కువ జరుగుతుందన్న ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సైంటిస్టులు. సెకండ్ వేవ్ లో ప్రపంచాన్ని గడగడలాడించిన ‘డెల్టా’ వేరియంట్ కొమ్ముల్ని ఒమిక్రాన్ విరిచేస్తోందని చెబుతున్నారు.

అంతేకాదు డెల్టా సహా భవిష్యత్తులో ప్రపంచంలోకి పుట్టుకువచ్చే మరిన్నీ వేరియంట్ల నుంచి కూడా ఒమిక్రాన్ కాపాడగలుగుతుందని చెబుతున్నారు. ఇక మరోలా చెప్పాలంటే కరోనా మహమ్మారి సోకకుండా ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కరోనా వాక్సీన్ కన్నా ఇది ఎక్కువ మేలు చేస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలా అంటే ఒమిక్రాన్ సోకిన వాళ్లలో దానిని నిరోధించేందుకు ఉత్పన్నమయ్యే రోగనిరోధక శక్తితో.. ‘డెల్టా’, ఒమిక్రాన్ తో పాటు మిగతా అన్ని వేరియంట్ల నుంచీ మెరుగైన రక్షణ లభిస్తోందని ఐసీఎంఆర్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఒక విధంగా కరోనా వ్యాక్సీన్ తో లభించే యాంటీ బాడీల కన్నా ఒమిక్రాన్ వేరియంట్ తో లభించే యాంటి వైరల్ లోడ్ చాలా ఉత్తమమైనది అంటున్నారు.

ఒమిక్రాన్ సోకినవారిలో ఏర్పడే ప్రతిరక్షకాలు.. రీఇన్ ఫెక్షన్ రాకుండా రక్షణనిస్తున్నాయి. దీంతో డెల్టా డామినేషన్ తగ్గిపోయిందని, ఒమిక్రాన్ ప్రభావమే ఎక్కువైందని పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఒమిక్రాన్ ఆధారిత వ్యాక్సిన్ విధానాలను అమలుచేయాల్సిన అవసరం ఉందని వివరించింది. ఒమిక్రాన్ సోకిన 39 మందిపై ఐసీఎంఆర్ ఈ స్టడీ చేసింది. అందులో 25 మంది ఆస్ట్రాజెనికా కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారు. మరో 8 మంది ఫైజర్ రెండు డోసులు వేసుకున్నారు. ఆరుగురు అసలు ఏ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. స్టడీలో 28 మంది ఒమిక్రాన్ ప్రభావిత దేశాలవారున్నారు. వారిలో ఐజీజీ ప్రతిరక్షకాలతో పాటు వైరస్ ను మట్టుబెట్టే న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలను విశ్లేషించారు. అందరిలోనూ న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలు.. అన్ని వేరియంట్లను సమర్థంగా నివారించాయని నిర్ధారించారు. ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురణ కోసం ఈ స్టడీని పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles