పెళ్లితో పెనవేసుకునే కొత్తబంధాల నేపథ్యంలో వారిని ఒక్కదరి చేర్చేలా మరింత క్లోజ్ అయ్యేందుకు ఇరువర్గాలు విందు, వినోదానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలో మగవాళ్లు మద్యం కూడా తీసుకుంటారు. దీనికే దావత్ అని కూడా అంటారు, ఇక పెళ్లి ఊరేగింపు సమయంలో వదూవరులను ధూమ్‌ధామ్ డ్యాన్సుల మధ్య అంగరంగ వైభవంగా బరాత్ నిర్వహించడం.. ఈ విషయాన్ని తమ కాలనీ వాసులు కూడా స్వాగతించేలా డీజే సౌండ్ తో గానాభజనాలు నిర్వహించడం కూడా సర్వసాధారణం. పేదవాళ్లు డప్పుచప్పుళ్ల మధ్య మధ్యతరగతి వారు డీజే సౌండ్ల మధ్య.. ఇలా ఎవరి స్థోమత మేరకు వాళ్లు పెళ్లిళ్ల బరాత్ లు నిర్వహించుకుంటారు. ప్రత్యేకించి కరోనా టైంలోనూ వీటిని వీడడం లేదు.
ఇన్నాళ్లు జరిగిన పెళ్లిళ్లలో జరిగినవి చాలు. ఈ మందు, చిందు, గానాభజానాలకు ఇకపై చెక్ పెడాల్సిందేనని అదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ఎవరైనా పెళ్లిళ్లలో మద్యం దావత్ లను ఏర్పాటు చేసినట్లు తెలిసినా.. లేక డీజే సౌండ్స్ తో బరాత్ నిర్వహించినా జరిమానా తప్పదు. వీటికి పెళ్లింటి వారు అనవసర డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇక పెళ్లిళ్ల సమయంలో బంధువుల మధ్య లేక బరాత్ ల సమయంలో గ్రామప్రజలకు, పెళ్లింటివారికి మధ్య ఈవే తగువులకు కూడా కారణమవుతున్నాయని వీటిపై నిషేధాన్ని విధించారు. తమ ఈ నిషేధాజ్ఞలు ఉ్లలంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనున్నామని కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ నిషేధాజ్ఞల వార్తలు చర్చనీయాంశంగా మారియి.
ఇంతకీ ఈ మేరకు అదేశాలను జారీ చేసింది ఎవరు.? అనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమ బిడ్డలకు పెళ్లిళ్లు చేస్తూ.. డబ్బును దావత్, బరాత్ లకు విచ్ఛలవిడిగా ఖర్చుచైస్తున్న పెళ్లింటివారిని దృష్టిలో పెట్టుకుని.. కరోనా ఉన్నా లేకపోయినా.. ఇకపై తమ గ్రామంలో ఈ అదేశాలు అమలు జరగాల్సిందేనని నిర్ణయం తీసుకుంది ఓ గ్రామం. రాజస్థాన్‌లోని బన్స్వరా పరిధిలోని గోడీ తేజ్‌పూర్ గ్రామం. తాజాగా పెళ్లిళ్లలో మందు, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటి వల్లే వేడుకల్లో విషాదాలు, గొడవలు జరుగుతున్నాయని, అంతేకాదు వాటి వల్ల ఇరుకుటుంబాలు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి ఖర్చు చేసేది అనవసరమైన ఖర్చుగా పేర్కొంటున్నారు ఆ గ్రామ పెద్దలు. ఈ మేరకు నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు.
ఇక నుంచి వివాహ వేడుకల్లో ఈ రూల్‌ను ఉల్లంఘించిన వాళ్లకు.. మద్యం సేవిస్తే 21,000రూ., డీజే, నృత్యాలు చేస్తే 51 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. ఆ ఊరి మాజీ, ప్రస్తుత సర్పంచ్ల సమక్షంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొత్తం 13 వార్డ్ మెంబర్స్, జిల్లా పరిషత్, పంచాయితీ సమితి సభ్యులు, గ్రామస్తులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. సర్వ సమాజ్ పేరుతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గ్రామస్థులందరితో రిజిస్టర్లో సంతకాలు తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించిన కాపీ నకలును ధన్పూర్ పోలీసులకు సైతం అందించారు. సోషల్ మీడియాలో ఈ గ్రామ నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more