కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. దశ, దిశ, నిర్దేశం లేని పనికిమాలిన పసలేని బడ్జెట్ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యులకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందన్నారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ ఇది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యం. దేశ చేనేత రంగానికి బడ్జెట్లో చేసిందేమీ లేదన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు లేవని.. ఉద్యోగులు, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్‌ల స్లాబ్‌లు మార్చకపోవడం విచారకరం. వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధిలో కేంద్రం నిర్లక్ష్యం వహించిందన్నారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయకపోవడం విచారకరమన్నారు. వైద్య రంగంలో మౌలిక వసతుల పురోగతికి చర్యలు లేవన్నారు.
దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కేసీఆర్ అన్నారు. నదుల అనుసంధానం బిగ్ జోక్ అని.. జోక్ ఆఫ్ ది మిలీనియం అన్నారు. నదుల అనుసంధానం చేస్తారట.. సిగ్గు చేటు ఇది.. ప్రభుత్వం సిగ్గు పడాలి. గోదావరి కృష్ణ అనుసంధానం ఎలా చేస్తావు. ఏ అధికారంతో గోదావరి, కృష్ణ, కావేరిని అనుసంధానం చేస్తా అని చెప్పావు. గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు ఆధారంగా ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిన ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాల మీదనే ఉంటది అని వాటర్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌తో సమానం. మా నీళ్లను మమ్మల్ని అడగకుండా గోదావరి జలాలను కావేరీ నదిలో ఎలా కలుపుతావు. ఏ చట్టం ప్రకారం కలుపుతావు. ఇది జోక్ కాదా. ఇది సెన్స్ లెస్ కాదా. అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఎలా కలుపుతావు. మిగులు జలాలు ఉంటే ఇవ్వాలి. ఉంటే తెలంగాణ కోసం పంపించిన ప్రతిపాదనలకు ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు. దేశాన్ని ఇంత గోల్ మాల్ చేస్తారా? డీపీఆర్‌లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నీ ఇచ్చాం. ఇవన్నీ అక్కడ పెట్టుకొని.. గోదావరి జలాలను కావేరీలో కలుపుతవా? నీ ప్రాతిపదిక ఏంటి. తెలంగాణ, ఆంధ్రా అవసరాలు తీరిపోయాయా. మొత్తం ఇచ్చావా..? బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఒకటి చేస్తాం అంటే ఎలా చేస్తారో చెప్పాలి. అసలు తమ రాష్ట్రంలోని నదులను మిగతా నదులతో అనుసంధానం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడావా.? అని ప్రశ్నించారు. తెలివైన దేశాలు వందల కిలోమీటర్లు తీసుకుపోయి నీళ్లు ఇస్తున్నాయి. ఇవాళ మేము కూడా ఇస్తున్నాం.
కొత్త రాష్ట్రం అయినప్పటికీ.. మీరు పట్టించుకోకున్నా మేము తీసుకొచ్చి నీళ్లు ఇస్తున్నాం. మేము పండించిన పంట కొనే తెలివి లేదు మీకు.. కానీ నదుల అనుసంధానం చేస్తరా అంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను వసూలు చేస్తామని బడ్జెట్లో ప్రస్తావించడంపై స్పందించిన ఆయన ఎలా వస్తూలు చేస్తారని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీని మీరు ఒప్పుకున్నారా? అది అఫిషియలా? దీనికి మీ సమాధానం ఎంటి? అని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన క్రిప్టో కరెన్సీ మీద పన్ను వసూలు చేస్తారు. ఇది సెన్స్‌లెస్ కాదా? మీరు ఏదైనా మాట్లాడుతారు.. మీకు నచ్చింది చేస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. క్రిప్టో కరెన్సీని మీరు అఫిషియల్ చేశారా? అసలు కేంద్ర ప్రభుత్వానికి దిమాక్ ఉందా? అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ కు రూపం, స్వరూపం లేదు. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచింది. మోదీ సర్కార్ తెలంగాణపై కత్తికట్టి పీడిస్తోంది. కేంద్ర బడ్జెట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏ ఒక్కవర్గాన్ని సంతృప్తిపరిచేలా ఈబడ్జెట్ లేదు. గ్రామీణాభివృద్ధికి కూడా నిధుల్లో కోత పెట్టారు. కొత్త రాష్ట్రానికి ఎటువంటి మద్దతు లేదు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదు. రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా చర్యలు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్ఆరు. ఆరోగ్య రంగాన్ని గాలికి వదిలేశారు.
ఉపాధి హామీ పథకానికి 25 శాతం నిధులు తగ్గించారు. కేంద్రబడ్జెట్‌పై రచ్చబండలోనూ చర్చ జరగాలి. క్రిప్టో కరెన్సీపై క్లారిటీ లేదు. 30 శాతం పన్ను విధించారంటే లీగల్ చేస్తారా? దశ దిశ నిర్దేశం లేకుండా నిరుపయోగంగా బడ్జెట్ ఉందని ధ్వజమెత్తారు. పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి లబ్ధి కలగదు. కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, పేదలు, ఉద్యోగులు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్లో కేటాయింపులపై అన్ని రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఉపయుక్తంగా లేదని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more