కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని ఇప్పటికే దేశానికి చెందిన పలువురు రాజకీయ నేతలు, ఆర్థిక రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. కాగా బడ్జెట్ లో పలు వర్గాలకు చెందిన వారిని అసలు ప్రభుత్వం పట్టించుకోలేదని, గుర్తించలేదని రైతులను, మధ్యతరగతి వారిని వదిలేసిందని అరోపణలు మిన్నంటాయి. ఈ క్రమంలో ఈ సారి క్రిప్టో కరెన్సీని అధికారికంగా ఇప్పటికీ గుర్తించని కేంద్రం.. దానిపై సమకూరే లాభంపై మాత్రం ముప్పై శాతం పన్ను విధిస్తామని చెప్పడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. క్రిప్టో కరెన్సీపై పన్నువేస్తున్నట్టు ప్రకటించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. క్రిప్టో కరెన్సీ పన్నువిధానం కేంద్రం దోపిడి విధానానికి నిదర్శనమని దుయ్యబట్టింది.
దేశంలోని ప్రజలను అన్ని విధాలుగా ముక్కుపిండి పన్నులను వసూళ్తు చేస్తున్న కేంద్రం.. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయకుండానే.. అసలు సంబంధిత బిల్లు తీసుకురాకుండానే పన్ను ఎలా వసూలు చేస్తారని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశానికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. అసలు రెగ్యులేషన్ పరిస్థితి ఏంటి? క్రిప్టో ఎక్స్చేంజీల నియంత్రణ సంగతేంటి? ఇన్వెస్టర్ల రక్షణ ఏంటని ప్రశ్నలు సంధించారు. క్రిప్టో కరెన్సీతో కొందరు లాభాలను అర్జిస్తున్నారన్న విషయం తెలియగానే దానిపై పునరాలోచన చేయాల్సిన ప్రభుత్వాలు.. చట్టబద్దం చేసిన తరువాత పన్నువిధానాన్ని ప్రవేశ పెట్టాలి కానీ.. అలా కాకుండా ముందుగానే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం నిజంగా విడ్డూరంగానే వుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయాన్ని తప్పుబట్టారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చా జరగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని, కానీ బడ్జెట్లో మాత్రం దాని గురించి ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందిస్తూ 30 శాతం పన్ను వసూలు చేస్తామని బడ్జెట్లో ప్రస్తావించడంపై ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. అసలు చట్టబద్దత లేని క్రిప్టో కరెన్సీపై పన్నును ఎలా వస్తూలు చేస్తారని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీని మీరు ఒప్పుకున్నారా? అది అఫిషియలా? దీనికి మీ సమాధానం ఎంటి? అని ప్రశ్నించారు.
ఏ ప్రాతిపదికన క్రిప్టో కరెన్సీ మీద పన్ను వసూలు చేస్తారు. ఇది సెన్స్‌లెస్ కాదా? మీరు ఏదైనా మాట్లాడుతారు.. మీకు నచ్చింది చేస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. క్రిప్టో కరెన్సీని మీరు అఫిషియల్ చేశారా? అసలు కేంద్ర ప్రభుత్వానికి దిమాక్ ఉందా? అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. కాగా, నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో.. దేశంలో వర్చువల్ డిజిటల్ కరెన్సీ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, కాబట్టి దీనిపై పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. వర్చువల్ ఆస్తుల బదిలీపై 30 శాతం చొప్పున పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఒక శాతం టీడీఎస్ కూడా విధిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్చువల్ ఆస్తులు గిఫ్ట్ రూపంలో అందించినా ఇదే పన్ను వర్తిస్తుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more