PM Modi inaugurates Statue of Equality in Hyderabad సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించిన ప్రధాని నరేంద్రమోడీ..

Pm modi inaugurates statue of equality in hyderabad

PM Narendra Modi, Statue of equality, Chinna Jeeyar Swamy, Tamilisai Soundararajan, Union Ministers Narendra Singh Tomar, G. Kishan Reddy, Talasani Srinivas Yadav, Telangana

The song ‘Vaishnav Janatho’ is written by a saint inspired by Swami Ramanujacharya’s teachings and it is remembered every time Gandhiji is remembered. This is how spirituality had influenced India’s freedom struggle,” said PM Narendra Modi, after inaugurating the statue of Equality.

ముచ్చింతల్ లో.. సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించిన ప్రధాని నరేంద్రమోడీ..

Posted: 02/05/2022 08:38 PM IST
Pm modi inaugurates statue of equality in hyderabad

ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన భారీ రామానుజాచార్యుల వారి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. ఈ క్రతువు అనంతరం లాంఛనంగా విగ్రహావిష్కరణ జరిగింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చిన్నజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యాగం చేయించారని మోదీ వెల్లడించారు. ఈ యజ్ఞ ఫలం 130 కోట్ల మంది ప్రజలకు అందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక్కడి శ్రీరామనగరంలో 108 దివ్యక్షేత్రాలను సందర్శించానని చెప్పారు.

కాగా, దేశమంతా తిరిగి పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనుభూతి ఇక్కడి క్షేత్రాలలో దర్శనంలో కలిగిందని భక్తిపారవశ్యంతో చెప్పారు. రామానుజాచార్యుల వారి విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని పేర్కొన్నారు. రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. ఆయన 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించారని కీర్తించారు. రామానుజాచార్యులు అప్పటి సమాజంలోని అంధవిశ్వాసాలను పారదోలారని కొనియాడారు. ఆయన జగద్గురు అని, ఆయన బోధనలు సదా ఆచరణీయం అని పేర్కొన్నారు.

మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని, రామానుజాచార్యుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం మనందరికీ ప్రేరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామానుజాచార్యుల వారి బోధనల్లో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తావన తీసుకువచ్చారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందిందని అన్నారు. వెండితెరపై తెలుగు సినిమా అద్భుతాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు చరిత్ర ఎంతో సంపన్ననమైవని వివరించారు.

ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, శ్రీరామచంద్రుడిలా ప్రధాని మోదీ కూడా వ్రతబద్ధుడు అని కొనియాడారు. రాముడి బాటలోనే మోదీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, రామానుజాచార్యుల వారు ఎంతటి సుగుణవంతులో మోదీ కూడా అంతే సుగుణశీలి అని కీర్తించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. మోదీ ప్రధాని పీఠం ఎక్కాక దేశ ప్రజలు తలెత్తుకుని జీవిస్తున్నారని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles