ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక్కడ అధికారంలో వున్న బీజేపి పార్టీ సమాజ్ వాదీ పార్టీల మధ్య హోరాహోరి ప్రచారం సాగుతోంది. ఈక్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఒకరు పార్టీ వేడిని తగ్గిస్తామని ప్రచారం చేస్తుండగా, మరోకరు మాత్రం నిరుద్యోగ యువత వేడిని చల్లార్చే శక్తి ఏ పార్టీలకు లేదని ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రవేశపెట్టి ఖాళీ స్థానాలను భర్తీ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తానని ఆగ్రా ప్రచార ర్యాలీలో అన్నారు. అంతేకాదు గతనెల 30న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషలో మీడియాలో... "సమాజ్‌వాద్ పార్టీ(తుపాకీ పార్టీ) నాయకులు కైరానా, ముజఫర్‌నగర్‌లలో తమ వేడి తగ్గలేదంటూ బెదిరిస్తున్నారు. మార్చి పది తర్వాత ఆ వేడి తగ్గిపోతుందిలే అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు." దీంతో అఖీలేశ్ యాదవ్ ఆయన వ్యాఖ్యల పై గత వారంరోజులుగా నిప్పులు చెరుగుతున్నారు.
అయినా సీఎం తమ పార్టీ వేడిని తగ్గించినా తాము అధికారంలోకి వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీ స్థానాలను తొలగిస్తామంటూ గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌సీఎం యోగికి హింసతోనే సాన్నిహిత్యం ఉంది తప్ప శాంతితో కాదు అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈసారి గోరఖ్‌పూర్ ఓటర్లు అతన్ని ఉత్తరాఖండ్‌కు తిరిగి పంపుతారని అన్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి మాట్లాడుతూ.."యోగి ఆదిత్యనాథ్ అసౌకర్య ప్రశ్నలను నివారించడానికి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తాడు. అయినా యోగి నిరుద్యోగ యువత వేడిని ఎలా తగ్గిస్తారో పేర్కొనాలి" అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more