కర్నాటకలో హిజబ్ (బురఖా) వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చతూనే ఉంది. ముందుగా ఉడిపి, కొలార్ జిల్లాల్లోని పలు కాళాశాలకు మాత్రమే పరిమితిమైన ఈ వివాదాం ఇప్పుడు ఈ రెండు జిల్లాలోని మిగతా కాలేజీలతో పాటు పలు జిల్లాలకు కూడా వ్యాపించాయి. తాజాగా బాగల్కోటె జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. హిజబ్ వివాదంలో ఇప్పటిదాకా రాళ్లు రువ్వుకున్న సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే మతరాజకీయాలు రాజేసిన రాజకీయ పార్టీలు.. అభంశుభం తెలియని విద్యార్థులను రెచ్చగోట్టి తమాషా చూస్తున్నాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
రాష్ట్రంలోని విద్యార్థుల మధ్య ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్నపరిస్థితులు ప్రస్తుతం ఆందోళనకరంగా మారుతున్నాయి. బాగల్కోటె జిల్లాలో గల రబకవి బనహట్టిలోని ప్రీ-యూనివర్శిటీ కళాశాల వద్ద ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజబ్ను ధరించిన పలువురు విద్యార్థినులు కళాశాల ఎదురుగా నిరసనప్రదర్శనలకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు నినదించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు.
అదే సమయంలో విద్యార్థినుల నిరసనలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు కాషాయ కండువాలతో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టారు. పరిస్థితి చేయిదాటకముందే అదుపు చేశారు. బనహట్టిలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వివాదాన్ని శాంతియుంతంగా పరిష్కరించడానికి జిల్లా పాలన యంత్రాంగం ప్రయత్నిస్తోందని అన్నారు. హిజబ్ వేసుకుని ముస్లిం అమ్మాయిలు కాలేజీలకు రావడాన్ని స్థానిక విద్యాసంస్థలు నిషేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నాటక హైకోర్టు హిజబ్ బ్యాన్ గురించి కేసును విచారించనున్నది.
At MGM College in Udupi. Girls who want to wear the hijab and boys wearing the saffron shawl are now arguing with each other. College management requesting everyone to stay calm. pic.twitter.com/K0uJ66VYhQ
— Prajwal (@prajwalmanipal) February 8, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more