ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిరాజేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అమరవీరుల ప్రాణత్యాగాలను ప్రధాని అవహేళన చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్న బీజేపి.. కాకినాడ తీర్మాణం చేసిన తరువాత 2014లోనే ఎందుకు రాష్ట్ర విభజనను చేపట్టలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. సుఖ ప్రసవం చేస్తామని.. చెప్పి మూడు రాష్ట్రాలను విభజించించిన బీజేపి తెలంగాణను ఎందుకు వదిలేసిందని.. తెలంగాణ ద్రోహి బీజేపి అని దుయ్యట్టారు.
ప్రధాని వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ఎక్కడికక్కడ మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని సబ్ కా సాత్ అన్నది మాటల వరకేనని, ఆయనలో ఇప్పటీకీ విభజించి పాలించు అనే తత్వమేనని రేవంత్ దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. బీజేపీ సీనియర్లను మోసం చేసి మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. మోడీ మాటల్లో ప్రేమను కనబరుస్తారు కానీ వాస్తవంలో ప్రజలను విడదీసి రాజకీయ స్వలాభాన్ని వెతుక్కుంటారని ఆయన దుయ్యబట్టారు.
ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణలో బీజేపీ ప్రచారం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన వాజ్ పేయి... తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అప్పట్లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి కాదని చెప్పారు. ఏపీపై ఎంతో ప్రేమను కనబరుస్తున్న ప్రధాని.. ఏపీకి తన ఎనమిదేళ్ల హయాంలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఏపీ నేతలు ఎంతో ఒత్తిడి చేసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు. ఒక రాష్ట్రంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణను ఇచ్చారని చెప్పారు.
ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య దీటుగా స్పందించారు. గతంలో బీజేపీ మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిందని, అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవలేదని పొన్నాల ప్రశ్నించారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఏదేమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంగీకరించారని పొన్నాల పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని టుక్డే టుక్డే పార్టీ అనడం సరికాదన్నారు. అయినా మోదీ పాలనలో ఏం ఒరిగిందని పొన్నాల నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులు ఏంచేశారన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more