సూర్యోదయానికి కాసింత ముందు వెనుకల్లో.. లేదా సూర్యస్తామయ సమయంలో పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్లకు వెళ్లడాన్ని గమనిస్తుంటాం. రెక్కలు విరుచుకుని అంతాకలసి ఆలా వెళ్తుంటే చిన్నారులు వాటిని చూసి తెగ సంబరపడుతుంటారు. అయితే ఏదో ఒక పెద్ద పక్షి చిన్న పక్షులపై దాడి చేసే ఘటనలు ఎంతో అరుదుగా కానీ వీక్షించం. ఇలా వివిధ రకాల అందమైన పక్షులు సందడి చేసి అలరించిన వీడియోలను అనేకం వీక్షించాం. కానీ వందలాది పక్షులు ఒక సమూహంలా ఏర్పడి ఎగిరిన దృశ్యాలను వీక్షించడం అత్యంత అరుదు.
ఇదిగో ఈ వీడియోలో చూస్తే వందలాది పక్షుల సమూహం ఒకేసారి ఆకాశంలో విహరిస్తూ అకస్మాత్తుగా భూమిపైకి వచ్చిపడటంతో వాటిలో పదుల సంఖ్యలో పక్షులు గాయాలపాలై చనిపోయాయి. నిర్ఘాంతపరిచే ఈ వీడియోల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మెక్సికోలో పసుపు రంగు తలతో ఉన్న ఒకే రకమైన వందలాది పక్షలు ఆకాశంలో విహరిస్తూ చనిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అయితే ఆ వీడియోలో వందలాది పక్షలు ఒక సమూహంగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నట్టుండి ఒకేసారి భూమి మీద పడి విగత జీవులుగా మారిపోయాయి. అందులో కొన్ని నెమ్మదిగా తేరుకుని ఎగిపోయాయి కూడా. నిపుణలు మాత్రం బహుశా ఒక వేటాడే పక్షి ఈ పక్షలు మందను వేటాడి ఉండవచ్చు. అప్పుడు ఒకేసారి ఎగిరే క్రమంలో ఒక్కసారిగా కింద పడి చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు యూకే సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ హైడ్రాలజీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ బ్రౌటన్ మాట్లాడుతూ.. "పెరెగ్రైన్ లేదా హాక్ వంటి రాప్టర్ పక్షుల సమూహాన్ని వెంబడిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కోన్నారు.
ఆ క్రమంలో ఆ పక్షలు సమూహం వాటి నుంచి తప్పించుకునేందుకు సమూహంలా ఏర్పడి భూమిపై వాలేందుకు రాగా.. అనుకోకుండా అవి భూమిపై వున్న ఇళ్లు, విద్యుత్ తీగలు ఇతర వస్తువులను బలంగా తగిలడంతో అవి తీవ్రంగా గాయపడ్డాయని పేర్కోన్నారు. కాగా, ఆ సమూహంలోని చాలా వరకు పక్షులు తేరుకుని ఎగిరివెళ్లిపోగా, పదుల సంఖ్యలో మాత్రం పక్షులు అక్కడి చనిపోయాయని అన్నారు. అంతేకాదు వీడియో ఫుటేజ్‌లో వందలాది పక్షలు వీధుల్లో హఠాత్తుగా పడిపోయినట్లు కనిపించింది. పైగా అందులో చాలా వరకు ఎగిరిపోగా.. కొన్ని చెల్లాచెదురుగా పడిపోయి చనిపోయి ఉన్నాయి. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు ఈ వీడియో వెనుక 5 జీ సాంకేతికత ఉందని కొందరు , మరికొందరేమో షార్ట్ సర్యూట్ జరడంతోనే అవి అలా పడిపోయాయి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
WARNING: GRAPHIC CONTENT
— Reuters (@Reuters) February 14, 2022
Security footage shows a flock of yellow-headed blackbirds drop dead in the northern Mexican state of Chihuahua pic.twitter.com/mR4Zhh979K
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more