'Distribute 100 Coca-Cola to Bar': HC orders cop హైకోర్టు బార్ అసోసియేషన్ కు ఉచితంగా కోకాకోలా డ్రింక్.. ఇదీ శిక్షే.!

Gujarat high court pulls up cop for drinking coke during vc hearing

High Court virtual case hearing, cop sipping Coca-Cola, cop sipping Coca-Cola during Virtual hearing, HC orders cop to distribute 100 coke cans to bar, Gujarat High Court Bar Association, AM Rathod, Gujarat Cop, Chief Justice Aravind, Justice Ashutosh J Shastri, Gujarat High Court, Coca Cola, distribute 100 cans, Trending news

Coca-Cola is an aerated drink that is loved by many. But, little did this man knew that his love for Coca-Cola will put him in front of a legal bench. A Gujarat Cop was directed by the Gujarat High Court to distribute 100 cans of Coca-cola to the Bar Association or face disciplinary action.

హైకోర్టు బార్ అసోసియేషన్ కు ఉచితంగా కోకాకోలా డ్రింక్.. ఇదీ శిక్షే.!

Posted: 02/17/2022 03:47 PM IST
Gujarat high court pulls up cop for drinking coke during vc hearing

కోకాకోలా అద్దాల ప్రిడ్జ్ లో చూస్తే దానిని తాగాలని అనిపించడం కామన్. ఇక అదే టిన్ అయితే.. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా.? అని మనస్సు ఆరాటపడుతోంది. దాని పట్ల తనకున్న ప్రేమను కనబర్చిన ఓ పోలీసు అధికారికి గుటుక్కుమంటూ తాగడాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చూశారు. తనతో పాటు బార్ అసోసియేషన్ సభ్యులైన న్యాయవాదులు కూడా చూశారని గమనించారు. అంతే.. ఆ అధికారికి ఇవాళ సాయంత్రం లోపు బార్ అసోసియేషన్ కు ఓ 100 కోకాకోలా టిన్లు పంపించండీ. అని అడిగేశారు. అదేంటబ్బా.. ఎంత న్యాయమూర్తి అయితే మాత్రం మార్కెటుకెళ్లి కొని తెచ్చుకోవాలి కానీ ఇలా అడిగేస్తారేమిటీ అంటారా.?

మూడవదశలో ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో చాలా న్యాయస్థానాల మాదిరిగానే గుజరాత్ న్యాయస్థానం కూడా వర్చువల్ పద్దతిలో కేసుల విచారణను చేపట్టింది. దీంతో ఓ కేసులో విచారణకు హాజరైన ఓ పోలీసు ఉన్నతాధికారి.. ఓ వైపు విచారణకు హాజరవుతూనే.. మరోవైపు తన టేబుల్ పైనున్న కోకాకోలా టిన్ లోంచి కోక్ ను తాగేస్తున్నాడు. అయితే తాను చేస్తున్న పని తనను చట్టపరమైన బెంచ్ ముందు నిలబెడుతుందని ఈ వ్యక్తికి తెలియదు. కానీ అదే జరిగింది. అతడి పనిని గమనించిన ప్రధాన న్యాయమూర్తి.. ఇవాళ సాయంత్రంలోపు బార్ అసోసియేషన్‌కు 100 కోకాకోలా డబ్బాలను పంపిణీ చేయాలని అదేశించారు.

అలా చేయని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ గుజరాత్ పోలీసులను ఆదేశించారు. ఏఎం రాథోడ్ అనే పేరుతో లాగిన్ అయిన ఈ గుజరాత్ పోలీసు, హైకోర్టులోని ఓ కేసు విచారణకు హాజరైన వర్చువల్ హిరయింగ్ ద్వారా హాజరైనప్పుడు, కోకాకోలా తాగడు. దానిని గమనించిన చీఫ్ జస్టిస్ అరవింద్ ఆగ్రహానికి గురయ్యారు. జస్టిస్ అశుతోష్ జె శాస్త్రి నేతృత్వంలో జరిగిన వర్చువల్ విచారణ సమయంలో, రాథోడ్ ఇలా కోలా తాగుతుండటాన్ని గమనించారు. అతను "వీడియో కాన్ఫరెన్స్‌లో కోకాకోలా తాగుతున్నాడు. ఈ పోలీసు అధికారి ఎవరు?" అని అరా తీశారు. ఫిజికల్ కోర్టుకు వస్తే ఇలానే ప్రవర్తిస్తారా.? అని మండిపడ్డారు.  

దీంతో అతను ఇవాళ సాయంత్రం లోపు బార్ అసోసియేషన్ కు 100 కోకాకోలా టిన్లను పంపించాలని లేని పక్షంలో అతనిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలని పోలీసు శాఖను అదేశించారు. అయితే సీనియర్ న్యాయవాది భాస్కర్ తన్నా, కోకా-కోలా కంటే తక్కువ హానికరంమైన ఏ డ్రింక్ అయినా పర్వాలేదని.. అది నిమ్మరసం అయినా పంచేలా అదేశించాలని కోరారు. దీంతో న్యాయమూర్తి సదరు అధికారి "అమూల్ జ్యూస్ ను ఏర్పాటు చేయాలని అదేశించారు. కోర్టులో ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి కాదు. ఒక సార్ ఒక న్యాయవాది సమోసా తింటూ కనిపించాడని, అయితే అందరిముందర తినడానికి వీలులేదని న్యాయమూర్తి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles