ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్యార్థులను ఎంబసీ సమీపంలోని స్కూల్లో వసతి కల్పించినట్లు భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులోని పొరుగు దేశాల ద్వారా భారతీయల తరలింపుపై విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమన్నారు. ప్రతి భారతీయుడు స్వదేశానికి చేరేవరకు ఎంబసీలో కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేశారని, దీంతో విపరీతమైన రద్దీ నేపథ్యంలో రోడ్లు, రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడిందని భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులంతా ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్న వారు నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కైవ్‌లో ఎవరైనా చిక్కుకున్నట్లయితే స్నేహితులు, కుటుంబాలు, భారతీయ సంఘం సభ్యులు, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రత కోసం కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
Embassy of India in Ukraine accommodates more than 200 Indian students at school near the Embassy in Kyiv
— ANI (@ANI) February 24, 2022
(Source: Embassy of India in Kyiv, Ukraine) pic.twitter.com/5aTjObCvN7
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more