రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు. కాల్పుల విరమణకు కూడా జెలెన్స్కీ ఆమోదం తెలిపినట్లు సెర్గే చెప్పారు. చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని, శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్ధాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్బుక్ పేజీలో సెర్గే తెలిపారు.
అయితే శాంతిచర్చలకు సంబంధించిన స్థలం, తేదీ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు నికోఫరోవ్ తెలిపారు. చర్చలు ఎంతవేగంగా జరిగితే, అంతత్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన అన్నారు. మిన్స్క్లో చర్చలు నిర్వహించాలని రష్యా భావించగా.. వార్సాలో జరిగే బాగుంటుందని ఉక్రెయిన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరో వైపు జెలెన్స్కీ ఇవాళ ఓ సెల్ఫ్ వీడియోను పోస్టు చేశారు. కీవ్ వీధుల్లో తిరుగుతూ ఆయన ఆ వీడియో తీశారు. రష్యా దళాలకు లొంగిపోవాలని పిలుపు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయన ఈ వీడియోను పోస్టు చేశారు.
ఆయుధాలను వీడాలని పిలుపు ఇవ్వలేదని ఆయన ఆ వీడియోలో స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో నకిలీ సమాచారం వ్యాప్తి అవుతోందని, తాము ఆయుధాలను వీడడం లేదని, తమ దేశాన్ని తాము రక్షించుకుంటామని జెలెన్స్కీ అన్నారు. ఆ వీడియోలో జెలెన్స్కీ"నేను ఇక్కడే ఉన్నాను, ఆయుధాలు వదిలి పారిపోలేదు. మా ఆయుధాలతో రష్యా దాడిని తిప్పి కొట్టి మా దేశాన్ని రక్షించుకుంటాం. ఇదే సత్యం. అలాగే ఇంటర్ నెట్లో నేను ఆయుధాలు వదిలేసి దేశం నుంచి పారిపోయానంటూ వదంతులు వస్తున్నాయి. వాటిని నమ్మకండీ అని ఆయన సూచించారు.
అది నిజం కాదు. ఇది మా భూమి మా దేశాన్ని, మా పౌరులను రక్షిస్తాం. మా ఉక్రెయిన్ కీర్తిని కాపాడుకుంటాం. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాది. అని అన్నారు. జెలెన్స్కీ ఆ వీడియోలో ఆలివ్ ఆకుపచ్చ మిలిటరీ తరహా దుస్తులు ధరించి నిర్విరామ యుద్ధంతో అలిసి పోయినప్పటికీ ఏ మాత్రం బెదరకుండా తమ అజేయమైన ధైర్యసాహసాల్ని ప్రదర్శించటం విశేషం. అంతేకాదు ఆ వీడియోలో రాజధాని కైవ్ చుట్టు రష్యా దళాలు భూ, వాయు, జల మార్గాలలో వేస్తున్న బాంబుల మోత వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది.
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more