Kavach to make Indian Railways journeys safer: Railway Minister ఒకే ట్రాకుపై ఎదురెదురుగా దూసుకెళ్లిన రెండు రైళ్లు..

Security system kavach will be tested two trains will collide railway minister will be present in one

Kavach, Ashwini Vaishnaw, Railway Minister, Lingampalli – Vikarabad section, Vinay Kumar Tripathi, Railway Board Chairman CEO, Automatic Train Protection ATP system, Indian Railways, railways, National Safety Day, Ashwini Vaishnaw, railways News, Telangana, Crime

Indian Railways is going to create a new history by testing the indigenously designed train collision protection system ‘Kavach’. Railway Minister Ashwini Vaishnav will be present in the coach during the trial. According to the Railways, two trains will be run in opposite directions at a speed of 160 kmph. But due to ‘armor’ these two trains will not collide.

ITEMVIDEOS: సికింద్రాబాదులో ఒకే ట్రాకుపై ఎదురెదురుగా దూసుకెళ్లిన రెండు రైళ్లు..

Posted: 03/04/2022 11:24 AM IST
Security system kavach will be tested two trains will collide railway minister will be present in one

సికింద్రాబాదులో రెండు రైళ్లు చాలా వేగంగా ఒకే రైల్వే ట్రాకుపై ఒకదాని ఎదురుగా ఒక‌టి దూసుకొచ్చాయి. అయితే ఒక రైల్‌లో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉండ‌గా, మరో రైల్లో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వినయ్‌కుమార్‌ త్రిపాఠి ఉన్నారు. దీంతో రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదం పోంచివున్న నేపథ్యంలో సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. అదేంటి రెండు రైళ్లు ఢీకొట్టుకుంటాయని సిబ్బంది అప్రమత్తంగా ఎందుకు ఉన్నారు.? ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రైళ్లను ఢీకోట్టకుండా పర్యవేక్షించాల్సిన సిబ్బంది.. ఇలా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.

ఇక ఈ రెండు రైళ్లలో కేంద్రమంత్రి, రైల్వేబోర్డు చైర్మన్ ఉన్నారంటే.. ఇక అవి ఢీకొంటే.. అల్ల‌క‌ల్లోల‌మే... కానీ ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకోలేదు. దీంతో పెద్ద ఉపద్రవమే తప్పింది అంటారా.? ఔనండీ.. రైల్లేశాఖలో త్వరలో రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీకొట్టకుండా వాటిని కొంత దూరంలోనే నియంత్రించే ప్రాజెక్టును అమలుపరుస్తోంది. దానినే తాజాగా రైల్వే మంత్రి, బోర్డు చైర్మన్ పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్టు పేరు 'క‌వ‌చ్'. 'కవచ్‌' అనేది ప్రపంచంలోనే అత్యంత చౌకైన 'ఆటోమేటిక్ ట్రైన్ కొల్లీష‌న్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్‌', అంటే, రెండు రైళ్లు ఎదురెదురుగా, వాటి గ‌రిష్ట వేగంతో వ‌స్తున్న‌ప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ర‌క్ష‌ణ‌గా వినియోగించే ఒక వ్య‌వ‌స్థ‌.

లోకో పైలట్ విఫ‌ల‌మైన‌ప్పుడు ఆటోమేటిక్ బ్రేక్‌ల అప్లికేషన్ ద్వారా 'కవాచ్' రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. అలాగే, సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత, 5-కిమీ పరిధిలో ఉన్న అన్ని రైళ్లు రక్షణ కల్పించేందుకు పక్కనే ఉన్న ట్రాక్‌లపై ఆగిపోతాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను రైల్వేలు "జీరో యాక్సిడెంట్‌" లక్ష్యాన్ని సాధించడం కోసం రూపొందించారు. 'క‌వ‌చ్' ఎలా ప‌నిచేస్తుందంటే, నిర్ణీత దూరంలో అదే లైన్‌లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలును నిలిపివేసేలా రూపొందించబడింది.

దీని ద్వారా, రెడ్ సిగ్నల్ జంపింగ్, మరేదైనా సాంకేతి, మాన్యువల్ లోపాన్ని డిజిటల్ సిస్టమ్ గమనించినప్పుడు రైళ్లు కూడా వాటంతట అవే ఆగిపోతాయి. ఇది ఒకసారి అమలులోకి వస్తే, ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనికి రూ. 2 కోట్లు ఖ‌ర్చు చేస్తుంటే దీనితో రూ. 50 లక్షలు మాత్ర‌మే ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. సనత్‌నగర్-శంకర్‌పల్లి సెక్షన్‌కు చెందిన‌ సిస్టమ్‌పై ఈ ట్రయల్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్‌కు వ‌చ్చారు. మార్చి 4న ఈ ట్రయల్‌లో రైల్వే మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్ పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles