TTD says no to hike Arjitha seva tickets price ఆర్జిత సేవల ధరలు పెంచబోం: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Ttd good news to devotees says no to hike arjitha seva tickets price

Tirumala, Tirupati, Tirumala Tirupati Devasthanams, TTD, TTD Board chairman, YV Subba Reddy, Sarva Darshan tickets, Seegra Darshan tickets, Arjitha Sevas, replace hotels, fast food centres, free Annaprasadam centres, Darshan tickets, Arjitha Sevas, Budget, Andhra Pradesh, Devotional

The Tirumala Tirupati Devasthanams (TTD) Board chairman YV Subba Reddy shares a key decision with the devotees of Lord Sri Venkateshwara Swamy. He says TTD is in no mood to hike the Arjitha seva tickets price.

శ్రీవారి భక్తులకు ఊరట.. ఆర్జిత సేవల ధరలు పెంచబోమన్న టీటీడీ చైర్మన్

Posted: 03/05/2022 11:09 AM IST
Ttd good news to devotees says no to hike arjitha seva tickets price

కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తులకు దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతృప్తికర వార్తను పంచుకున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ వార్తను వ్యక్తపర్చినా.. అనేకాంశాలతో కూడిన బడ్జెట్ లో మిగతా అంశాలే అధిక ప్రాధాన్యం సంతరించుకోగా, టీటీడీ అర్జిత సేవ టికెట్ల ధరలు పెంచుతున్నారన్న అపోహ మాత్రం భక్తులలో ఉండిపోయింది. దీంతో ఈ మేరకు ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు టీటీడీ చైర్మన్. ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే జరిగిందని ఆయన అన్నారు.

రెండేళ్ల తరువాత పది రోజులక్రితం సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం వల్ల భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు. భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని అన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని అన్నారు. అర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలు అందిస్తామన్నారు.  

భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని పేర్కొన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చైర్మన్‌ తెలిపారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, వీఐపీ దర్సనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles