దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపుతో పాటు సబ్సీడీ వంటగ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశప్రజల నుంచి తీవ్ర అందోళన వ్యక్తం అవుతోంది. పెంచిన ఇంధన ధరలు, గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని ఓ వైపు పార్లమెంటు ఆవరణలోకి జాతిపిత బాపూజీ విగ్రహం వద్ద విపక్ష నేతలు అందోళన చేపట్టగా.. మరోవైపు పార్లమెంటులోనూ పెట్రో, సిలిండర్ ధరల పెంపుపై విపక్షాలు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాయి. ఈ క్రమంలో ఎన్సీపీ అగ్రనేత, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలే కూడా తనదైన శైలిలో కేంద్రంలోని ప్రభుత్వంపై వ్యంగోక్తులు విసిరారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ప్రజలు పెరుగుతున్న ఇంధన దరలను మర్చిపోయేందుకు ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయి కూడా పెంచలేదని.. అయితే ఫలితాలు వెలువడగానే రెండు రోజుల వ్యవధిలో ఏకంగా రూపాయిన్నరకు పైగా ఇంధన ధరలు పెరిగాయని విమర్శించారు. అంతేకాదు వంటింట్లోని సబ్సీడి గ్యాస్ సిలిండర్ ధరలను కూడా కేంద్రం ఏకంగా రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై అమె మండిపడ్డారు. ఇకపై ప్రతి నెలా ఎన్నికలుండాలని, దీంతో పెట్రో ధరల పెంపు ఉండదని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికలు ఉన్నందునే పెట్రో ధరలు పెంచకుండా ఉన్నారు. ఇకపై ప్రతి నెలా ఎన్నికలుండాలి. అప్పుడు పెట్రో, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగవు’ అంటూ సుప్రియా సూలే ఎద్దేవా చేశారు.
ఇదిలావుండగా, నెట్టింట్లో తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాత ట్వీట్ కూడా వైరల్ గా మారింది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ హయాంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ అయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో సబ్సీడీ వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 50 మేర పెంచారు. ఈ నేపథ్యంలో అప్పటి విపక్ష పార్టీ నేతగా స్మృతి ఇరానీ ప్రజలు కష్టాల్లో ఉంటే సామాన్యుల ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ సామాన్యులకు గ్యాస్ సిలిండర్లను దూరం చేస్తోందంటూ అమె ట్వీట్ చేశారు. ఇక తాజాగా అదే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. అమెను నెట్ జనులు సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటే ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరింది. నిన్న పెట్రోలు రూ.109.10, డీజిల్ రూ.95.50గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పెట్రోల్ రూ.112.80, డీజిల్ రూ.98.10, విజయవాడలో పెట్రోల్ రూ.111.88, డీజిల్ రూ.97.90కి చేరాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more