ఒక్కోసారి కొత్తగా అలోచించి.. అందులోని లాజిక్ తో తమ కస్టమర్లను ఆకర్షించాలని భావించే సంస్థలు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా అలోచించడంలో తప్పు లేదు కానీ కొత్తదనం పేరుతో తమ సంస్థలోని ఉద్యోగుల ప్రాణాల మీదకు తీసుకువస్తే.. అది ప్రమాదన్న విషయాన్ని మర్చిపోవడమే కష్టాలకు కారణం అవుతోంది. తాజాగా ఫుడ్ డెలివరీ రంగంలో దూసుకుపోతున్న జుమోటో కూడా ఇలాంటి కష్టాలనే ఎదర్కోంటోంది. ఈ సంస్థ తాజాగా జారీ చేసిన ప్రకటన పోలీసులను కన్నెర చేసేలా చేసింది. నిత్యం రద్దీగా ఉండే తమ రోడ్లపై జోమాటో సిబ్బంది కష్టాలపై పోలీసులు అలోచించారు. అంతే నోటీసులు ఇచ్చారు.
తమ యాప్ ద్వారా ఆహారం బుక్ చేస్తే కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ చేసిన పుడ్ ను అందిస్తామని ఇచ్చిన ప్రకటనపై పోలీసులు మండిపడ్డుతున్నారుకన్నెర్ర చేశారు. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల్లో ఎలా వినియోగదారులకు ఆహారం డెలవరీ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. వినియోగదారుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే ఆహార పదార్థాలను జుమోటో ప్రతినిధులు ఇళ్లు, కార్యాలయాలు అంటూ ఎక్కడికైనా సరే తీసుకెళ్లి అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వినియోగదారుడికి మరింత చేరువయ్యే విధంగా ఆర్డర్ఇచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రకటనను జుమోటో వర్గాలు తాజాగా చేశాయి.
దీంతో కేవలం పది నిమిషాల్లో ఎలా డెలివరీ చేస్తారో..? అనే చర్చ బయలుదేరింది. చెన్నై వంటి నగరాల్లో అయితే, ఇది అసాధ్యమన్న సంకేతాలు కూడా వినిపించాయి. పది నిమిషాల్లో వినియోగ దారుడికి ఆహార పదార్థాలు అందించాల్సి ఉండటంతో, ఆ ప్రతినిధులు తమ వాహనాల్లో అతివేగంగా దూసుకెళ్లాల్సి ఉంది. ఈ సమయంలో ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించక తప్పదు. దీనిని పరిగణించిన చెన్నై ట్రాఫిక్ పోలీసు వర్గాలు జుమోటోకు నోటీసులు జారీ చేశాయి. పది నిమిషాల్లో ఎలా ఫుడ్ సరఫరా చేస్తారో అనే విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more