మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదిహేనేళ్లుగా మూసివున్న దుకాణ నుంచి పోలీసులు మానవ అవయవాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ దుకాణం నుంచి కొన్ని రోజులుగా దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయగా.. వారి దుకాణం తెరచి చూసి షాక్ కు గురయ్యారు. మహారాష్ట్రలోని నాకా ప్రాంతంలో 15 ఏళ్లుగా మూసివున్న ఓ దుకాణంలో 8 మానవ చెవులు, మెదడు, కళ్లు, ముఖ భాగాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భవనం నేలమాళిగలో ఉన్న ఈ దుకాణం నుంచి దుర్వాసన వస్తుండడంతో భరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తుక్కుతో నిండిపోయిన ఈ దుకాణంలోని రెండు ప్లాస్టిక్ కంటైనర్లను తెరవగా ఇవి బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్టు ముంబై నాకా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇది హత్య కాకపోవచ్చని భావిస్తున్నారు. మూసివున్న దుకాణం యజమాని ఇద్దరు కుమారులు మెడికల్ విద్యార్థులు కావడంతో వైద్య పరీక్షల కోసం వీటిని తెచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే, వాటిని రసాయనాల్లో ముంచినట్టు కూడా గుర్తించారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇది హత్యకేసుగా నమోదుచేయాలంటే స్థానికంగా ఎలాంటి మృతదేహాలు లభ్యంకాకపోవడంతో పోలీసులు న్యాయనిపుణలు సలహాలను తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ పౌర్నిమా చౌగులే మాట్లాడుతూ.. నిజానికి అక్కడ మృతదేహం ఉండి ఉంటే హత్యగా భావించేవాళ్లమని కానీ, మొత్తం 8 చెవులను నిపుణులు కానీ, లేదంటే ఇదే పనిలో కొనసాగుతున్న వారు కానీ కత్తిరించినట్టు ఉండడంతో అది హత్య కాదని నిర్ధారించినట్టు చెప్పారు. అయితే, ఈ విషయమై తనకేమీ తెలియదని షాపు యజమాని పోలీసులకు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more