TRS pass privilege notice against Piyush Goyal తప్పుదోవ పట్టించిన కేంద్రమంత్రిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు

Trs mps pass privilege notice against piyush goyal

TRS MPs, Piyush Goyal, Union Minister Piyush Goyal, Parliament, excess raw rice, Centre, Union Minister, Piyush Goyal, paddy procurement, Centre, Telangana, privilege notice, Rajya Sabha TRS MPs, Telanagan Politics

The TRS MPs on Monday moved a privilege notice against Union Minister Piyush Goyal in the Rajya Sabha of the Parliament. The TRS MPs moved a privilege notice against Piyush Goyal over the paddy procurement issue. The MPs stated that the Union Minister is misleading the house over the procurement of paddy in Telangana.

కేంద్రమంత్రిపై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు.. సభను తప్పుదోవ పట్టించారని అరోపణ

Posted: 04/04/2022 03:29 PM IST
Trs mps pass privilege notice against piyush goyal

కేంద్ర ఆహార‌శాఖమంత్రి పీయూష్ గోయ‌ల్‌.. పార్లమెంటుతోపాటు యావత్ దేశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించారని అరోపిస్తూ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సమిమి రాజ్యసభ సభ్యులు. వరి సేకరణ అంశంపై పీయూష్ గోయల్ పై టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందించారు. తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు పేర్కోన్నారు. వరి కోనుగోళ్లపై కేంద్రమంతి వాస్తవాలను కొట్టిపారేయడాన్ని కూడా గులాబి పార్టీ ఎంపీలు నోటీసులలో పేర్కోన్నారు.

గ‌త శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. డబ్ల్యూటీవో ఆంక్ష‌ల వ‌ల్లే పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేయ‌డంలేద‌న్నారు. అయితే కేంద్ర మంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్య‌లు అబద్ద‌మ‌ని ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్‌లో స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు జారీ చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యులు చైర్మెన్‌కు, లోక్‌స‌భ స‌భ్యులు స్పీక‌ర్‌కు ఆ లేఖ‌ను ఇచ్చారు. రూల్ 187 ప్ర‌కారం కేంద్ర మంత్రి పీయూష్‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ టీఆర్ఎస్‌ స‌భ్యులు త‌మ లేఖ‌లో తెలిపారు.

ఒక‌టో తేదీన పారా బాయిల్డ్ రైస్ ఎగుమ‌తిపై మంత్రి పీయూష్ ఇచ్చిన స‌మాధానం త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌ని, వాస్త‌వానికి విదేశాల‌కు మిలియ‌న్ ట‌న్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఆరోపించారు. మంత్రి స‌మాధానం స‌రైన రీతిలో లేని కార‌ణంగానే ఆయ‌న‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. లోక్‌స‌భ టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖ‌లో ప్ర‌స్తావిస్తూ రూల్ 222 కింద స్పీక‌ర్‌కు నోటీసు ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles