సకల చరాచర సృష్టిలో పునరుత్పత్తి చేసే అదృష్టం కలిగింది ఒకటి దైవం అయితే మరోకటి అమ్మ. అందుకనే అమ్మను ప్రకృతితో పోల్చుతారు. అమ్మ అనే రెండు అక్షరాల పదమే.. బిడ్డకు పెద్ద అండ.. వక్రమార్గంలోకి వెళ్తున్న బిడ్డను కోపంతో దండించినా.. అది అమ్మ తన బిడ్డను సన్మార్గంలోకి నడిపించేందుకు కఠినంగా చేసే ప్రయత్నమే. పశ్చిమ బెంగాల్ లో ఓ అమ్మ తన బిడ్డను కాపాడుకునేందుకు ఏకంగా పెద్దపుతిలోనే తలపడిందంటే అమ్మలోని సముద్రమంత లోతైన ప్రేమకు ఇదే నిదర్శనం. కేవలం మనుషులలో మాత్రమే కాదు.. పశుపక్షాదులలోనూ అమ్మకున్న ప్రేమ అదే. తమ బిడ్డలకు కష్టం రానీయకుండా ప్రతీ అడుగునూ ఆచితూచి వేయాలని నేర్పిస్తుంటాయి.
తాజాగా అమ్మ ప్రేమను, త్యాగనిరతిని, ప్రాణత్యాగాన్ని చాటే ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. బిడ్డను కాపాడుకునేందుకు తల్లి.. ఎంత దూరమైనా వెళ్తుందని చాటిచెప్పే ఈ వీడియో మనస్సున్న ప్రతీ ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. రాయిలాంటి గుండె ఉన్నవారిని కూడా కదిలిస్తోంది. సొంత ప్రయోజనాలను సైతం పక్కనపెట్టి బిడ్డ కోసం కృషి చేస్తుంది. ఓతల్లి జింక.. తన బిడ్డను రక్షించుకునేందుకు ప్రాణత్యాగం చేసింది. మనిషైనా.. జంతువైనా.. తల్లి ప్రేమ ఒకటే అని నిరూపించింది! ఐఏఎస్ ఆఫీసర్ సోనాల్ గోయల్.. మాతృమూర్తి వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
వీడియోలో.. ఓ జింక పిల్ల.. ఓ నదిలో ఈత కొడుతూ ఉంది. నదిలోకి దిగిన ఆనందంలో ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. అయితే నదిలో ఉన్న ఓ మొసలి.. జింక పిల్లను చూసింది. ఆహారం కోసం ఆ జింక పిల్లపై దాడి చేసేందుకు అటువైపు వేగంగా కదిలింది. ఈ దృశ్యాలను దూరం నుంచి చూసిన ఆ తల్లి జింక.. నదిలోకి దూకి.. వేగంగా బిడ్డవైపు కదిలింది. బిడ్డకు, మొసలికి మధ్య తన శరీరాన్ని అడ్డుపెట్టింది. అలా.. మొసలికి ఆహారంగా మారిపోయింది. ప్రాణ త్యాగంతో తన బిడ్డను రక్షించుకుంది. తల్లి జింకను నోట కరుచుకుని.. మొసలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్ల జింక ఒంటరిగా మిగిలిపోయింది!
"తల్లి ప్రేమను వర్ణించేందుకు మాటలు సరిపోవు. బిడ్డను రక్షించుకునేందుకు తల్లి జింక చేసిన ప్రాణత్యాగం హృదయాన్ని కదిలిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఎప్పటికి విడిచిపెట్టకూడదని ఈ వీడియో మనకు గుర్తుచేస్తోంది. వాళ్లని గౌరవించాలి, వారికి సేవ చేయాలి," అని ట్వీట్లో రాసుకొచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ సొనాల్ గోయల్. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తల్లి జింక ప్రాణత్యాగం అందరిని కదిలిస్తోంది. తల్లిప్రేమను గుర్తుకుచేసే విధంగా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
No words can describe the power, beauty and heroism of mother's love
— Sonal Goel IAS (@sonalgoelias) April 6, 2022
Heartbreaking video of a mother deer sacrificing herself for saving her baby
It reminds us to Never ignore your parents and family.
Respect them and take care of them when it's your turn
(VC : SM ) pic.twitter.com/e8K9WQiqIc
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more