Country-Made Pistol Found On Teacher In UP నాటు తుపాకీతో తిరుగుతున్న ఉపాధ్యాయురాలు అరెస్ట్..

Viral video country made pistol found on teacher in up after tip off

Country-Made Pistol, woman arrested, Karishma Singh Yadav, Teacher, Firozabad school, Kotwali area, 315 bore country-made pistol, female constable frisking, Jeans Pant Pocket, Ajay Kumar, Mainpuri Superintendent of Police, Mainpuri, Uttar Pradesh, Crime, viral video, social media

A woman was arrested in Uttar Pradesh's Mainpuri after being caught with a country-made pistol, police said today. Officials said Karishma Singh Yadav is a teacher in a school in Firozabad. "She was in Mainpuri yesterday because of some work," they added.

ITEMVIDEOS: నాటు తుపాకీతో తిరుగుతున్న ఉపాధ్యాయురాలు అరెస్ట్..

Posted: 04/13/2022 03:59 PM IST
Viral video country made pistol found on teacher in up after tip off

ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళా ఉపాద్యాయురాలు నాటు తుపాకీతో తిరగడం కలకలం రేపింది. ఫిరోజాబాద్ లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ నాటు తుపాకీ తన ప్యాంటు జేబులో పెట్టుకుని మెయిన్‌పురిలోని కోత్వాలి ప్రాంతంలో సంచరించింది. అయితే అభిఘ్నవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు సదరు మహిళా ఉపాద్యాయురాలిని అన్వేషించే పనిలో పడ్డారు. కొత్వాలి ప్రాంతాంలోని అమె కనిపించిన ప్రాంతానంతా పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో ఉపాధ్యాయురాలిని కనుగోన్న తరువాత అమెను నడిరోడ్డుపైనే మహిళా కానిస్టేబుళ్లు తనిఖీ చేశారు. అమె జీన్స్ ఫ్యాంటు ఎడమవైపు వెనుకాలి జేబులో 315 బోర్ కలిగిన నాటు తుపాకీని పోలీసులు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు. అయితే మహిళ తన జేబులో నాటు తుపాకీ పెట్టుకుని ఫిరోజాబాద్ నుంచి మెయిన్ పురికి ఎందుకు వచ్చింది.? తుపాకీతో అమెకు ఏం పని.? అమెకు తుపాకీ ఎక్కడిది.? ఎవరి నుంచి వచ్చిందన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో బయటపడనున్నాయి.

అక్రమంగా ఆయుధాలు కలిగి ప్రజల మధ్య తిరుగుతున్న నేపథ్యంలో కరిష్మాసింగ్ యాదవ్ పై అక్రమాయుధాల సెక్షన్ల కింద కేసును పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో అమెను అదుపులోకి తీసుకున్నామని మెయిన్ పురి జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఆమె తుపాకీతో ఎక్కడికి వెళ్తున్నది, దానికి ఎక్కడ నుంచి సేకరించింది? దాంతో అమెకు పనేంటి.? అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles