సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా మారిందో.. ఎలా దాని ప్రభావన స్థానికులను పడేట్లు చేస్తుందో అన్న విషయం ఇప్పటికే పలు వీడియోల ద్వారా వ్యక్వమైంది. కాగా, ఏకంగా పోలిస్ స్టేషన్ పైనే స్థానికులను ఉసిగోల్పేలా చేస్తోందని తాజాగా జరిగిన ఘటన నిరూపిస్తోంది. ప్రజల్లో శాంతిభద్రతలను నిత్యం కాపాడాల్సిన బాధ్యత ఉన్న పోలీసుస్టేషన్ పైనే ఓ మూక అకస్మాత్తుగా వచ్చి దాడి చేసింది. రాళ్లు రువ్వింది. ఈ దాడిలో కనీసం 12 మంది పోలీసులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ఇంతకీ ఈ దాడికి కారణమేంటీ అంటే స్టేటస్‌గా పెట్టుకున్న వీడియో.
ఓ వ్యక్తి చెందిన స్టేటస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి పోలీస్ స్టేషన్‌పై దాడికి కారణమైంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఈ ఘటన హింసకు దారితీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రార్థనా మందిరంపై కాషాయ జెండాను ఎగురవేస్తున్నట్టుగా ఉన్న ఎడిట్ చేసిన వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఆ వీడియో ఓ గంటలోనే వైరల్ అయింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరో వైపు, వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఓ వర్గానికి చెందినవారు డిమాండ్ చేశారు.
అంతటితో ఆగని స్థానికులు.. ఒకరు ఒకరుగా పోగై.. సుమారు వెయ్యిమందికి పైగా అర్ధరాత్రి వేళ హుబ్బళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో ఓ ఆలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, సీఐ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు. వారి దాడిలో గాయపడిన నలుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more