Assam Police arrests Gujarat MLA Jignesh Mevani గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని అరెస్ట్..

Gujarat mla jignesh mevani arrested by assam police late night over tweet

Jignesh Mevani, Jignesh Mevani Arrested, Assam Police, Gujarat MLA Jignesh Mevani, Assam Police, Gujarat MLA, Prime Minister Narendra Modi, Tweet, Arup Kumar Dey, BJP leader police complaint, Kokrajhar Police, Assam Police, Circuit House, Palanpur, Gujarat Assembly polls, Gujarat, Politics

Gujarat MLA Jignesh Mevani has been arrested by the Assam Police from the state’s Palanpur area late on April 20 night. Mevani, who extended support to the Congress last year, was picked from a Circuit House and taken to Ahmedabad and will be taken to Ahmedabad today. Police has not disclosed the reason of his arrest yet.

గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని అరెస్ట్..

Posted: 04/21/2022 01:31 PM IST
Gujarat mla jignesh mevani arrested by assam police late night over tweet

గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ అరెస్ట్ అయ్యారు. ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన అస్సాం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అస్సోంలో బీజేపికి చెందిన కీలక నేత అక్కడి పోలీసులకు మేవానిపై పిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో బనస్కాంత జిల్లాలోని పాలన్‌పూర్‌ సర్క్యూట్‌ హౌజ్‌ వద్ద గతరాత్రి 11.30 నిమిషాలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్వీట్‌పై చెలరేగిన వివాదంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన అనుచరులు మాత్రం పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా మేవానీని అరెస్ట్ చేశారని అరోపిస్తున్నారు.

జిఘ్నేష్‌ అరెస్టును ఆయన మద్దతుదారులు ధ్రువీకరించారు. అయితే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కాపీ లేకుండానే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానిపై అస్సాం పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక కమ్యూనిటీని కించపరచడం, రెండు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు కుట్ర పన్నడం, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించడం.. వంటి ట్వీట్‌లు చేసినందుకు ఎమ్మేల్యే జిగ్నేష్‌ మేవానీపై పోలీసులు ఈ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.
 
జిగ్రేష్‌ మేవానీ వేద్గాం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి శాసనసభ సభ్యుడిగా గెలుపొందారు. అయితే, ఆయన గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. జిగ్నేష్ మేవానీతో పాటు సామాజిక కార్య‌క‌ర్త, రాజకీయ నాయకుడు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కన్హయ్య కూమార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. మేవానీ మాత్రం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా తన పదవీ కాలం ఉన్నంత వరకు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతానని ప్రకటించారు.

జిగ్నేష్ మేవాని అరెస్టును ఖండించిన రాహుల్ గాంధీ

ద‌ళిత నేత జిగ్నేష్ మేవానీ అరెస్ట్‌పై మోదీ స‌ర్కార్ ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించింది. సత్యాన్ని అణిచివేయలేరని.. అసమ్మ‌తిని అణిచివేసినా నిగూఢమూన నిజాన్ని ఏమార్చ‌లేర‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ చేశారు.మోదీజీ.. మీరు అధికార యంత్రాంగంతో అస‌మ్మతిని అణిచివేయాల‌ని చూసినా.. నిగూఢమైన నిజాన్ని మాత్రం  ఎన్న‌డూ నొక్కిపెట్ట‌లేర‌ని రాహుల్ కేంద్ర స‌ర్కార్ తీరును దుయ్య‌బ‌ట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని అరెస్టు చేయడం ప్రజలను అవమానించడమేనని అన్నారు.

న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌ల‌కు భ‌య‌ప‌డుతోంద‌ని అర్ధ‌రాత్రి ద‌ళిత నేత జిగ్నేష్ మేవానీ అరెస్ట్ ఇందుకు విస్ప‌ష్ట సంకేత‌మ‌ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జీవాలా అన్నారు. మేవానీ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధ చ‌ర్య అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ప్రజాప్రతినిధులను కలవరానికి గురిచేసి.. వారిని దొడ్డిదారిన తమ పార్టీకి మద్దతు పలికేలా చేసుకునే యత్నాలను ఇప్పటికే దేశప్ర‌జ‌లు గమనించారని విమర్శించారు. ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకోవ‌డం ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డమేన‌ని మండిప‌డింది. మోదీ స‌ర్కార్ అణిచివేత చ‌ర్య‌ల‌ను కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లో దీటుగా ఎండ‌గ‌డ‌తార‌ని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles