పోలీసులు ప్రభుత్వ అదేశాలను అములు పరుస్తూ.. ప్రజలు నిత్యం శాంతిభద్రతలతో పరఢవిల్లేలా విధులు నిర్వహిస్తూంటారు. అయితే రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా రాజకీయ పార్టీలతోనూ అనుబంధం లేకుండా తమ విధులు నిర్వహిస్తారు. కానీ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం తనపై దాడికి యత్రించాడని ఓ బాధితుడు పోలిస్ స్టేషన్ కు వెళ్లగా ఆయనకు పరాభవం ఎదురైంది. పిర్యాదుదారి పిర్యాదును తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు.. ఏకంగా పిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడినే చితకబాది స్టేషన్ నుంచి గెంటివేసి.. మళ్లీ ఇలాంటి పిర్యాదులతో వస్తే.. బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత పిర్యాదుదారుడిపై చెలరేగిపోయిన ఎస్ఐ.. ఏవో పాతకక్షలు ఉన్నట్టుగా అతడిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోతూ.. ఎడాపెడా కొట్టాడు. తన తల్లి దివ్యాంగురాలి కోటా కింద పెన్షన్ ఇప్పించేందుకు స్థానిక రూ. 5000 తీసుకున్నాడని అరోపిస్తుండగానే.. ఎవడికి రా నువ్వు రూ.5000 ఇచ్చిందీ అంటూ పరుగుపరుగున వచ్చి బాధిత పిర్యాదుదారుడిపై విరుచుకుపడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని ఎస్ఐ చితకబాదుతున్న వీడియోను అక్కడున్న కొందరు స్థానికులు తమ మొబైల్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. ఎస్ఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సంజీవరాయునిపల్లెకు చెందిన పద్మావతమ్మ దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్నారు. ఆమె టీడీపీ మద్దతురాలన్న కారణంతో పింఛను తొలగించాలంటూ స్థానిక వైసీపీ నేత దామోదర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారించిన గ్రామ సచివాలయ కార్యదర్శి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నట్టు నిర్ధారించడంతో పింఛను కొనసాగుతోంది. మరోపక్క, తల్లి పింఛనను తొలగించేందుకు దామోదర్‌రెడ్డి ప్రయత్నించినట్టు తెలియడంతో పద్మావతమ్మ కుమారుడు గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లి నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది.
దీంతో వేణు తాగి తన ఇంటి వద్ద గొడవ చేస్తున్నాడంటూ దామోదర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి వేణును మందలించి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాతి రోజు వేణు మరికొందరితో కలిసి దామోదర్‌రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వేణును చూసిన వెంటనే అకారణంగానే ఎస్సై రంగడు చెలరేగిపోయాడు. దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. వేణును చితకబాదుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పెనుకొండ డీఎస్పీ రమ్యను నియమించారు.
వేణుపై ఎస్సై రంగడు యాదవ్ దాడిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడిపై చేయిచేసుకోవడమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? అని ఓ ట్వీట్లో నిలదీశారు. వేణుపై దాడికి పాల్పడిన వైసీపీ నేతలు, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. సీఎం జగన్ స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more