కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నది ఇప్పటివరకు జరిపిన పరిశోధనలతో వైద్య నిపుణులు మనకు చెప్పిన విషయం. నోటి తుంపర్ల నుంచి వచ్చిన వైరస్ ఏదైనా ఉపరితలం, వస్తువులపైకి చేరి, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించొచ్చని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకనే ఏదేని వస్తువును ముట్టుకున్నా వెంటనే చేతులు శానిటైజ్ చేసుకోవాలని చెప్పారు. తద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చేనని సూచనలు చేశారు. ఇక దీనికి తోడు ముఖానిక మాస్క్ కూడా తప్పనిసరిగా ధరించాలని హెచ్చరికలు జారీ చేశారు.
కానీ, తాజాగా జరిపిన అధ్యయనాలతో గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తెలుసుకున్నారు. గాలి ద్వారా వ్యాప్తి చెందడం ద్వారానే ఇది అత్యంత తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిందని కూడా పరిశోధకలు చెబుతున్నారు. ఈ మేరకు వార్తలు గతంలోనూ వచ్చినా వాటిని అప్పట్లో థృవీకరించలేదు. ఈ క్రమంలో గాలిలో కరోనా పార్టికల్స్ ఎక్కువ సమయం ఉండవని చెప్పారు, కేవలం వెంటిలేషన్ లేని గదుల్లోనే కరోనా పార్టికల్స్ ఉంటాయని కూడా అద్యయనాలు తెలిపాయి. కానీ గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశాలు అధికంగానే వున్నాయని తాజా అద్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే హైదరాబాద్ కు చెందిన సీఎస్ఐఆర్-సీసీఎంబీ, చండీగఢ్ కు చెందిన సీఎస్ఐఆర్-ఐఎంటెక్, హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల సహకారంతో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలు ఎయిరోసాల్ సైన్స్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. నిజానికి కరోనా వైరస్ ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందన్న దానికి ఇతమిద్దమైన ఆధారాల్లేవు. ఉపరితలం, నీటి తుంపర్ల రూపంలో వైరస్ ఉన్న వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తున్నట్టు గత పరిశోధనల్లో గుర్తించారు. కానీ, కరోనా వైరస్ సూక్ష్మ కణాల రూపంలో గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న దానికి లోగడ ఆధారాలు లభించలేదు.
కానీ, తాజా అధ్యయనం గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించింది. హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల (కరోనా బాధితులున్న) ప్రాంతాల నుంచి గాలి నమూనాలను సేకరించి, జీనోమ్ కంటెంట్ ను పరీక్షించారు. ఆయా ప్రాంతాల్లోని గాలిలో కరోనా వైరస్ బయటపడింది. కరోనా బాధితులు ఉన్న ఆసుపత్రుల్లోని ఐసీయూ, నాన్ ఐసీయూ ప్రాంతాల్లోని గాలిలోనూ కరోనా వైరస్ కణాలను గుర్తించారు. రోగులు విడిచిన వైరస్ ఇదని వారు పేర్కొన్నారు. తగినంత వెంటిలేషన్ లేకపోతే గాలిలో కరోనా వైరస్ నిలిచి ఉంటుందని తమ అధ్యయనం ఫలితాలు చెబుతున్నట్టు సైంటిస్ట్ శివరంజని మనోహన్ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more