Student arrives on stretcher for exam in TN సర్జరీ నుంచి కోలుకోకుండానే పరీక్షా కేంద్రానికి బాలిక..

Student arrives to exam hall in ambulance after undergoing surgery in tn

willpower, 17-year-old, Girl, Exam, stretcher, government school, Ganapathipalayam, abdominal pain, laparoscopy, examination centre, 17-year-old girl, Rithania, Kuppandampalayam, tirupur district, ambulance, public exam, tamil nadu

A 17-year-old girl from Kuppandampalayam in Tirupur district, who was admitted to the hospital on May 2 with a severe stomach ache, had to undergo laparoscopy as the doctors discovered that one of the veins supplying blood to the intestines was completely blocked. The student, Rithania, requested the doctors to let her go to the examination centre and appear for the public exam.

సర్జరీ నుంచి కోలుకోకుండానే పరీక్షా కేంద్రానికి బాలిక.. అంబులెన్స్‌లో పంపిన వైద్యులు

Posted: 05/05/2022 08:56 PM IST
Student arrives to exam hall in ambulance after undergoing surgery in tn

పరీక్షలు అనగానే ఫోబియాతో పలువురు విద్యార్థులకు జ్వరం వచ్చేస్తోంది. ఇక పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే హమ్మో అంటారు విద్యార్థులు. ఇక్కడి తరగతి గదిలో ఇన్విజిలేటర్, లకల్ స్వాడ్, ఫ్లయింగ్ స్వాడ్, హెడ్ మాస్టార్.. ఇలా అనేక మంది కళ్లు పరీక్షలు పూర్తయ్యేంతవరకు పూర్తిగా విద్యార్థులపైనే ఉంటాయి. దీంతో విద్యార్థినీ విద్యార్థులు రాత్రింబవళ్లు ప్రిపేర్ అవుతారు. ఇక ఏ మాత్రం అనారోగ్యంతో బాధపడినా.. విద్యార్తులే కాదు, తల్లిదండ్రులు కూడా అన్ని పరీక్షలను రాయకపోతే సమ్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటూ మార్క్ మెమోలలో చూపుతారని, దీంతో తమ బిడ్డలకు భవిష్యత్తు విద్యాకు కష్టం అవుతుందని పంపుతుంటారు.

అయితే నోప్పితో ఏం రాస్తారులే అంటూ కోందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను వెనకేసుకువస్తారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి తత్లిదండ్రులు వద్దని వారించినా.. వైద్యులను వేడుకుని మరీ పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్షలను రాసింది. పోస్టు ఆపరేటివ్ వార్డులో పేషంటుగా ఉన్నా అమ్మాయికి తాను పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఎలాగైనా రాయాలన్న తలంపుతో అమె పరీక్షా కేంద్రానికి హాజరై పరీక్షలు రాసింది. అనారోగ్యం బాధిస్తున్నా ప‌రీక్ష‌లు మిస్ కాకూడ‌ద‌నే సంక‌ల్పంతో బాలిక ఏకంగా అంబులెన్స్‌లోనే పరీక్షా కేంద్రానికి హాజ‌రైన ఉదంతం త‌మిళ‌నాడులోని తిరుపూర్ జిల్లా కుప్పందంపాళ్యంలో వెలుగుచూసింది.

తీవ్ర‌ క‌డుపునొప్పితో మే 2న ఆస్ప‌త్రిలో చేరిన బాలిక‌కు వైద్యులు లాప‌రోస్కోపీ నిర్వ‌హించారు. ఆమె ప్రేవుల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే సిర‌ల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోయిన‌ట్టు గుర్తించారు.  ఈ క్ర‌మంలో ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు ప‌రీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని బాలిక రిధానియా (17) వైద్యుల‌ను కోరింది. ఆమె కోలుకుంటున్నా.. ఆమెలోని పట్టదలను మొచ్చుకున్న వైద్యులు.. అంబులెన్స్ లో వెళ్లి పరీక్ష రాసేందుకు అనుమతించారు. అమెతో పాటు వైద్య బృందం కూడా బాలిక‌తో పాటు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అనుమ‌తించారు.  రిధ‌నియా బాగా కోలుకుంటున్న‌ద‌ని, ప‌రీక్ష రాయాల‌ని ఉత్సాహంగా ఉండ‌టంతో ఆమెను అన్ని జాగ్ర‌త్త‌లతో ప‌రీక్షా కేంద్రానికి పంపామ‌ని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్ట‌ర్ అరుళ్ జ్యోతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles