Karate Kalyani attacks youtuber Srikanth Reddy, virla video కరాటే కల్యాణి నుంచి నాకు ప్రాణ హాని ఉంది: శ్రీకాంత్ రెడ్డి

Tollywood actress karate kalyani and youtuber srikant reddy publicly slap each other

Karate Kalyani, youtuber Srikanth Reddy, Youtuber Srikanth Reddy news, Actor Karate Kalyani news, Srikanth Reddy Karate Kalyani, Prank videos, Youtuber attacked by Actor, Yousufguda, Hyderabad, Telangana

Karate Kalyani, a character artist who has been quite vocal about the affairs of the Telugu Film Industry and especially about the plight of women, was in the news again for trying to be a moral police. she allegedly slapped a YouTuber named Srikanth Reddy about certain videos he made which were derogatory in nature in respect to women and posted on YouTube.

ITEMVIDEOS: కరాటే కల్యాణి నుంచి నాకు ప్రాణ హాని ఉంది: శ్రీకాంత్ రెడ్డి

Posted: 05/13/2022 07:41 PM IST
Tollywood actress karate kalyani and youtuber srikant reddy publicly slap each other

సినీ నటి కరాటే కల్యాణి, యూట్యూబ్ ప్రాంక్ స్టర్ శ్రీకాంత్ రెడ్డికి మధ్య వివాదం రాజుకుంటూనే ఉంది. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పరిధిలో ఉన్న మధురానగర్ లో వీరిద్దరూ గొడవపడ్డి.. కొట్టుకున్నారు. వీరిద్దరూ పరస్పరం ఒకరిపైఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అంతటితో వీరి మధ్య తగవు సమసిపోయిందని అనుకుంటే.. మళ్లీ రాజుకుంటూనే వుంది. కళ్యాణి నుంచి తనకు ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పోలీసులను వేడుకుంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య అసలేం జరిగిందీ.. ఎందుకు వీరు పిర్యాదుల వరకు వెళ్లారన్న విషయాలపై శ్రీకాంత్ ఓ వీడియో ద్వారా వివరించాడు.

ఇంట్లో రాత్రి భోజనం చేస్తున్నప్పుడు మరో మగ్గురు వ్యక్తులతో కలిసి కరాటే కల్యాణి వచ్చిందని.. 'శ్రీకాంత్ బయటకు రా' అని అందరూ గట్టిగా అరిచారని... దీంతో తాను బయటకు వెళ్లానని చెప్పాడు. శ్రీకాంత్ నువ్వు మహిళలను కించపరిచేలా వీడియోలు చేస్తున్నావంటూ కల్యాణి తనను దూషించిందని.. నువ్వు సినిమాల్లో చేసే సీన్లు మాత్రం బాగున్నాయా? అని తాను ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత లక్ష రూపాయల డబ్బు ఇవ్వాలని తనను డిమాండ్ చేసిందని... డబ్బులు ఇవ్వకపోతే హైదరాబాదులో తిరగనివ్వనని, తనకు మహిళా సంఘాలతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించిందని చెప్పాడు.

అమెతో పాటు వచ్చిన ఓ వ్యక్తి రూ. 70 వేలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోమని చెప్పాడని తెలిపాడు. దీంతో తాను అసలు ఎవరికి.. ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించానని అన్నాడు. తన మాటలు వినగానే ఆమె తనను కొట్టిందని, ఆమె పక్కనున్న వాళ్లు కర్రలు తీసుకుని తనను కొట్టేందుకు యత్నించారని శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. బతుకు తెరువు కోసం తాను వీడియోలు చేస్తుంటానని తెలిపాడు. స్క్రిప్ట్ పరంగానే తమ వీడియోలు రూపొందుతాయని చెప్పాడు. వీడియోలు చేయాలని అమ్మాయిలు తమ వద్దకు వస్తుంటారని... డబ్బులు తీసుకుని తాను వీడియోలు తయారు చేస్తుంటానని తెలిపాడు.

తన యూట్యూబ్ వీడియో ఎడిటర్, కెమెరామెన్ ఉపాధి పొందుతున్నారని చెప్పాడు. అయితే తన వీడియోలు మంచి చెడుకు మధ్య ఉన్న గీతను ఎప్పుడు దాటవని. ఎలాంటి సందర్భంలోనూ శ్రుతి మించి ఉండవని, సినిమాల్లో కంటే తక్కువగానే ఉంటుందని అన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టిస్తానని, అమ్మాయిలను తీసుకొచ్చి రేప్ కేసులు పెట్టిస్తానని కల్యాణి బెదిరించిందని చెప్పాడు. చంపేస్తానని బెదిరించిందని... ఆమె నుంచి తనకు ప్రాణ హాణి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఈ వీడియోను విడుదల చేస్తున్నానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles