మహారాష్ట్ర పర్యటనలో ఔరంగజేబు సమాధిని దర్శించుకుని, నమాజ్ చేసిన మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చర్యను అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తాయి. ఈ చర్యలతో శాంతియుతంగా వున్న మహారాష్ట్రలో విద్వేషాలు రగల్చాలని ఎంఐఎం భావిస్తోందిని శివసేన అరోపించింది. అలాంటి చర్యలతోనే కనక మజ్లిస్ ప్రణాళికలో ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరించింది. ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావిస్ కూడా ఎంఐఎం ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారు.
ఔరంగాబాద్ జిల్లా ఖుల్దాబాద్ లో ఔరంగజేబు సమాధిని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించారు. అనంతరం అక్కడ నమాజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఔరంగజేబును కీర్తించడం ద్వారా అక్బరుద్దీన్ ఒవైసీ భారతీయ ముస్లింలను అవమానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఔరంగజేబును కీర్తించే ప్రయత్నాన్ని అక్బరుద్దీన్ చేశారు. ఇది జాతీయ భావం కలిగిన ముస్లింలను అవమానించినట్టు. ఈ దేశంలోని ముస్లింలకు ఔరంగజేబు ఎంత మాత్రం ఆరాధ్యుడు కాడు. శంభాజీరాజాను చంపడానికి ముందు అతడిని హింసించాడు’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
ఔరంగజేబును ఏ రూపంలో కీర్తించాలన్నా తాము అందుకు ఏమాత్రం అంగీకరించబోమని అన్నారు. ప్రజలను హింసించి పాలించే రాజుగా ఆయన అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఆయన మరణించిన తరువాత ఇన్నాళ్లకు ఆయన సమాధిని దర్శించి.. నమాజ్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలా చేసేవారు ప్రతిచర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ‘ఎవరో ఒకరు లీలావతి హాస్పిటల్ (ఎంపీ నవనీత్ రాణా ఎంఆర్ఐ గది వద్ద ఫొటో తీసుకోవడం) వద్ద ఫొటో తీసుకున్నారని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ఈ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు’’ అని ఫడ్నవిస్ విమర్శించారు.
ఈ విషయంపై శివసేన కూడా తీవ్రంగానే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఔరంగజేబు. ఆయన సమాధి ముందు నమాజ్ చేయడం అంటే ఒవైసీ సోదరులు మహారాష్ట్రను సవాలు చేయడమే. ఒవైసీ సోదరులు రాజకీయం చేస్తున్నారు. ఈ మట్టిలోనే ఔరంగజేబును పాతిపెట్టాం. ఆయన అనుచరులు ఎవరైతే ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారో వారికీ అదే గతి పడుతుంది’’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అయితే, ఖుల్దాబాద్ కు ఎవరొచ్చినా ఔరంగజేబు సమాధిని సందర్శించడం మామూలేనని, ఇందులో భిన్నమైన అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more