ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో ఉన్న ప్రేమను.. ప్రియురాలికి చెప్పాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక కొంత మంది తమ ప్రేమ గురించి తెలిపితే, మరికొందరు ఆ తన ప్రేమిస్తున్న విషయం చెప్పలేక, వన్ సైడ్ ప్రేమికుడిగ మిగిలిపోతారు. అంతే కాకుండా అబ్బాయిలు ప్రపోస్ చేసే విధానం బట్టీ కూడా అమ్మాయిలు పడుతారంటారు.. అది ఎంత వరకు నిజమో చెప్పలేం కానీ, కొన్ని సంఘటనలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది. ఓ అబ్బాయి ప్రపోజ్ చేసిన తీరుకు.. అమ్మాయి ఇట్టేపడిపోయింది. ఇక ఆప్రేమ కాస్త పెళ్లి పీటల వరకు వచ్చింది. ఎలా అనుకుంటున్నారా..?
ఏ అబ్బాయి అయినా తన ప్రేమను తెలుపడానికి రోస్ ఫ్లవర్ ఇచ్చి చెబుతుంటారు. మరీ ఎక్కువ ప్రేమ అయితే గోల్డ్ రింగ్ పెట్టి ప్రేమను తెలియజేస్తారు. కానీ, మహరాష్ట్ర లోని కొల్హాపూర్లో వెరైటీ ప్రేమ ప్రపోజల్ ఘటన జరిగింది. సౌరభ్ కస్బేకర్, ఉత్కర్ష ఇద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నప్పటికీ ఒకరికొకరు అసలు తెలియదు. కాగా, సౌరభ్ ఉత్కర్షను చూసిన మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఇక ఈమే నాజీవిత భాగస్వామి అని ఫిక్స్ అయ్యాడు.. కానీ ఒకసారి కూడా తనకు తన ప్రేమ విషయం తెలపలేదు. దీంతో అమ్మాయి ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో.. తాను ఎక్కడ మిస్సైతుందో అని భయపడి ఆమెకు తన ప్రేమ విషయం తెలపాలని ఆరాటపడి పోయారు.
ఎలాగైన తనకు ప్రపోజ్ చేయాలని నిశ్చయించుకున్న సౌరభ్ ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. దాని మీద మ్యారీ మీ ఉత్కర్ష అని రాసిపెట్టాడు. ఇక ఆ అమ్మాయి రాగానే నెలపై కూర్చోని.. ఐలవ్ యూ ఉత్కర్ష, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన ప్రేమ విషయం చెప్పేశాడు. ఇక అతని ప్రపోజ్కు ఫిదా అయిపోయిన యువతి, తన ప్రేమను యాక్సెప్ట్ చేసింది. ఇంతలా ప్రేమించే వ్యక్తి దొరకడని భావించి తన కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యింది. ఇక వీరిద్దరి పెళ్లికి ఫ్యామిలీస్ ఒప్పుకోవడంతో.. వీరి ప్రేమకు ఎండ్ కార్డ్ పడి పెళ్లికి రెడీ అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more