Monsoon to arrive in Telangana by June 5 తెలంగాణలోకి జూన్ 5 నాటికి రుతుపవనాల ఎంట్రీ.!

Telangana likely to witness monsoon rains in 4 5 days says meteorological centre

IMD update, IMD alert, imd rainfall uodate, monsoon 2022, monsoon 2022 uodate, monsoon kerala, monsoon telangana, monsoon tamil nadu, monsoon karnataka, Monsoon, monsoon predictions, telangana Rains, telangana rainfal, Hyderabad rains, Warangal weather update, Hyderabad weather, weather, Hyderabad, Telangana Weather Update, where is it raining, Telangana monsoon, Telangana

The Meteorological Centre at Hyderabad has reported that Telangana is set to receive isolated rainfall in the next five days. Meteorological Centre Hyderabad scientist Sravani stated that the monsoon is expected to reach Telangana on June 5.

రానున్న ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు.. జూన్ 5 నాటికి రుతుపవనాలు

Posted: 05/31/2022 02:19 PM IST
Telangana likely to witness monsoon rains in 4 5 days says meteorological centre

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్‌ 5న తెలంగాణలో రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. ‘జూన్ 5న తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి..’ అని శ్రావణి పేర్కొన్నారు. ఉదయం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సాయంత్రం ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపారు.

తెలంగాణలో రుతుపవనాలు జూన్ 5 లేదా 6 న పురోగమిస్తాయి. ఇప్పటికే కేరళను తాకిని రుతుపవనాలు అటు అరేబియా సముద్రం వైపు కూడా వేగంగా విస్తరిస్తున్నాయని, దీంతో తెలుగు రాష్ట్రాలకు విస్తరేందేందుకు కూడా అనువైన వాతావరణం ఉందని.. ఈ నేపథ్యంలో ఈ వారం చివరినాటికి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తాయని అమె తెలిపారు. అయితే అప్పటి వరకు ఉష్ణోగ్రత 32 నుండి 40 డిగ్రీల మధ్య ఉంటుంది. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయ వివరించారు. రుతుపవనాల రాకతో తొలకరి జల్లులు పలుకరించగానే వాతావరణం చల్లబడుతుందని తెలిపారు.

రుతుపవనాల ఉత్తర పరిమితి కన్నూర్, పాలక్కాడ్, పరిసర ప్రాంతాల గుండా కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే 3-4 రోజుల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాగా, ఈ సారి దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం అంచనా వేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles