ఈ కాలంలో నీతి, నిజాయితీలు గురించి ఎవరిని అడిగినా చెప్పేస్తున్నారు. గంటల పాటు నిల్చున్న చోట నుంచి కదలకుండా ప్రసంగాలు గుప్పిస్తున్నారు. అయితే వారిలో వాటిని ఆచరించే వారు ఎంతమంది అంటే మాత్రం కాస్తా కష్టమైన టాస్క్ అనే చెప్పాలి. కానీ మన భారతీయుల్లో మాత్రం ఇంకా నీతి నిజాయితీ ఉందని అటోడ్రైవర్ల నుంచి పలు చిన్నాచితక పనులు చేసుకునే పేదల్లో ఇంకా అవి కొట్టోచ్చినట్టు కనబడుతున్నాయి అనడానికి ఇప్పటికే పలు ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తమ జీవితాలకు తమకు లభించిన వస్తువు అత్యంత అసరమని తెలిసినా.. వాటి విలువ తెలిసిన వ్యక్తులు నిజాయితీగా వ్యవహరించిన.. వాటిని వాటి యజమానుల దగ్గరకు చేరవేస్తున్నారు.
కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. దేశం కాని దేశం.. ఏకంగా డబ్బుల మూట లభించినా.. తన అవసరం తీరిపోతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసి స్వదేశం తిరిగివచ్చేయవచ్చే అవకాశం వున్నా.. తన నిజాయితీకే ప్రధమ తాంబులం ఇచ్చిన వ్యక్తి మన భారతీయుడు. ఔనా ఎక్కడ అంటారా..? దుబాయ్లో భారతీయ వ్యక్తికి డబ్బుల మూట కళ్లముందు కనిపించింది. అడిగేవారు లేరు. నాది అనేవారు లేరు. దానిని తీసుకుని వెళ్లినా.. అప్పటికప్పుడు ప్రశ్నించేవారు లేరు. అయినా ఆ వలస కార్మికుడు తన నిజాయితీకే ఓటువేశాడు. ఆయనే తరీక్ మహమూద్ ఖలీద్ మహమూద్.
ఇక్కడ అల్ బార్షా ప్రాంతంలో నివశిస్తున్నాడు. తను ఉండే అపార్ట్మెంట్ లిఫ్టులో అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఏంటా? అని చూస్తూ పది లక్షల దీనార్లు (రూ.2.1 కోట్లపైగా) డబ్బులు దొరికాయి. వాటిని చూసి కూడా దురాశ చెందని తరీక్ మహమూద్.. వెంటనే ఆ డబ్బును తీసుకెళ్లి స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించాడు. అతని నిజాయితీ చూసి మెచ్చుకున్న పోలీసులు.. తరీక్ను గౌరవిస్తూ ఒక ధ్రువపత్రాన్ని అందించారు. ‘‘మన సమాజంలో ఉండే ఉన్నతమైన విలువలకు అతని నిజాయితీ అద్దం పడుతోంది’’ అని పోలీసు ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.
#News | Dubai Police Honours Man for Returning AED 1,000,000
— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) June 5, 2022
Details:https://t.co/HQgOPCTW75#YourSecurityOurHappiness#SmartSecureTogether pic.twitter.com/JVWF2qW7Lm
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more