తాబేళ్లు అనగానే.. మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది ఓ నానుడి.. అదేనండీ స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్.. నిదానంగా.. స్థిరంగా ముందుకు సాగితే విజయం తప్పక లభిస్తుంది. ఈ నానుడి ఎందుకు వచ్చిందో తెలుసుగా.? చిన్నప్పుడు చదువుకున్న పాఠం. ఇక దాని జోలికి వెళ్లకుండా.. తాబేళ్ల విషయానికి వస్తే ఇవి లక్ష్మీదేవి వాహనాలు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లుగా భావిస్తారు. ఈ భూమ్మీద మనుషులతోపాటు లక్షలాది జీవజాలం కూడా ఉంది. వాటిలో కొన్న జంతువులు మన దేవదేవతలకు వాహనాలుగా ఏర్పాటు చేసుకున్నారు.
అయితే వారం రోజులు కష్టపడిన మనుషులు వారాంతంలో ఎంజాయ్ చేయడం మామూలే. మరి మనలాగే జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాయా? అంటే సమాధానం ఏం చెప్తాం? ఇదిగో ఇప్పుడు మనం చూసే వీడియో కూడా అలాంటిదే. కొన్ని తాబేళ్లు చెరువులో పడిన ఒక దుంగపై నిలబడి ఉయ్యాల ఊగుతూ కనిపించాయి. వాటి బరువు ఆధారంగా దుంగ నీళ్లలో ఆటు ఇటు ఊగింది. ఇలా దుంగ ఊగుతూ బ్యాలెన్స్ అదుపుతప్పిన తాబేళ్లు ఒకదాని తర్వాత మరోకటి నీళ్లలో పడిపోయాయి. నీళ్లలో పడిపోయిన తాబేళ్లు మళ్లీ దుంగపైకి ఎక్కేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాగా ఈ వీడియో ముగిసే సమయానికి కేవలం మూడు తాబేళ్లు మాత్రమే దుంగపై మిగిలివున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నవ్వేస్తున్నారు. ఔరా తాబేళ్లు కూడా ఇలా నీళ్లలో ఆటలాడుతాయా.? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచారో మాత్రం తెలియడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. అంతలా ఊగిపోతున్న దుంగ మీదకు ఈ తాబేళ్లను ఎవరు ఎక్కించారు? అని అడుగుతున్నారు. ఇది కచ్చితంగా తాబేళ్ల ప్రేమే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్లో ఈ వీడియోకు ఇప్పటికే 37 లక్షలపైగా లైక్స్, 84 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.
I like this game..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more